Babri Masjid demolition case verdict on Today: లక్నో: 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) పై ఈరోజు (Sep 30) తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు తీర్పును ప్రకటించనుండటంతో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే తీర్పు సందర్భంగా 30వ తేదీన కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ అగ్రనేతలంతా కోర్టు (CBI Special court) కు వ్యక్తిగతంగా హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబరు 16న ఆదేశించిన సంగతి తెలిసిందే. Also read: Corona To Vice President Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా
1992 డిసెంబరు 6న యూపీలోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన కేసులో 32మంది నిందితులుగా ఉన్నారు. వారిలో బీజేపీ అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani), మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్, ఉమాభారతి, కల్యాణ్ సింగ్, వినయ్ కటియార్, సాధ్వీ పలువురు వీహెచ్పీ అగ్రనేతలు నిందితులుగా ఉన్నారు. అయితే వీరిలో ఉమా భారతి, కల్యాణ్ సింగ్కు కరోనావైరస్ (Coronavirus) సోకడంతో వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక అద్వానీ, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, ఎంఎం జోషి, సతీష్ ప్రధాన్, నృత్యగోపాల్ దాస్ కూడా అనారోగ్య కారణాల వల్ల కోర్టుకు వ్యక్తిగతంగా కాకుండా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం ఉంది. మిగతావారు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతారని పేర్కొంటున్నారు. Also read: Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు
అయితే ఈ కేసును రెండేండ్లలో విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటినుంచి రోజువారి విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ 351 మంది సాక్షులను, 600 డాక్యుమెంటరీ పత్రాలను కోర్టు ముందు సమర్పించింది. సుధీర్ఘ విచారణ అనంతరం తీర్పు ఈ రోజు రానుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.