Arnab Goswami Sensational Comments: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అల్లు అర్జున్ ను అరెస్ట్ జైల్లో పెట్టాలనుకున్నారు.. ఎందుకంటే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు కాబట్టి బేయిల్ దక్కే అవకాశం లేదని ఈ వ్యూహం రచించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అయ్యారు అల్లు అర్జున్ సూపర్ స్టార్ గా నిలిచారని ఆర్నాబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని పేర్కొన్నారు..
ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. సినిమా సెలబ్రిటీలు సైతం రేవంత్ రెడ్డి పై మండిపడుతున్నారు... కేవలం ఒకరినే బాధ్యతలను చేయడం సరి కాదని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.. ఆయనకు అండగా నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు.. అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అందరి దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్టార్ కావాలని చూశారు కానీ ఏదైనా ఫ్లాప్ యాక్టర్ అయ్యారని కానీ అల్లు అర్జున్ మాత్రం సూపర్ స్టార్ గా నిలిచారని అన్నారు. గతంలో తన విషయంలో కూడా అలాగే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు..
ఇదిలా ఉండగా డిసెంబర్ 5వ తేదీ పుష్ప2 సినిమా రిలీజ్ అయింది. అంతకు ముందు రాత్రి బెనిఫిట్ షో నిర్వహించారు. ఎక్కువమంది సినిమా చూడడానికి రావడం ఆ సమయంలోనే అల్లు అర్జున్, రష్మిక ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరటంతో బన్నీని చూడ్డానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చేసారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. ఈ కేసు విషయమై నిన్న శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం అరెస్టు చేశారు. అయితే కోర్టు మద్యంతర ఫైల్ మంజూరు చేసింది కానీ బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వులు జైలు అధికారికి రావడానికి ఆలస్యమైంది. నేడు బన్నీ జైల్లో నుంచి బయటకు వస్తారు..
రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అయ్యాడు
అల్లు అర్జున్ సూపర్ సూపర్ స్టార్ అయ్యాడురేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ను వీకెండ్ అరెస్ట్ చేసి సోమవారం వరకు జైల్లో పెట్టాలి అనుకున్నాడు - అర్ణబ్ గోస్వామి
Video Credits - Republic TV pic.twitter.com/ctd7BbH497
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024
జులూస్‌కు పర్మిషన్ తీసుకోలేదుగా.. అందుకే తొక్కిసలాట జరిగింది: పీపీ
బన్నీ అరెస్టు విషయంలో సినీ పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చింది.. ముఖ్యంగా నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇది బ్లాక్ డే అని ఎంపీ రవి కిషన్ కూడా అన్నారు.. రేసుగుర్రం సినిమాలో 'మద్దాలి శివారెడ్డి' పాత్ర పోషించారు.. ఇది దురదృష్టకరమని తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలతోనే చేస్తున్నారని దీని పై విచారణ జరపాలని రవి కిషన్ అన్నారు..
మోహన్ బాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు, అరెస్టుకు అవకాశం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.