Holidays: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఈ నెలలో వరుసగా రెండు రోజులు సెలవులు ఉన్నాయి. మహా శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అటు బ్యాంకులకు కూడా పబ్లిక్ హాలిడే ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజులు సెలవు ప్రకటించింది 26వ తేదీన మహా శివరాత్రి పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ఉండటంతో విద్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. హిందువులకు పవిత్రమైంది కావడంతో ఆ రోజు దేశవ్యాప్తంగా సెలవు ఉంది. ఫలితంగా అన్ని విద్యాలయాలు మూతపడనున్నాయి. ఇక ఫిబ్రవరి 27వ తేదీన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రభావం రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఉంటుంది.
ఇక మహా శివరాత్రి పురస్కరించుకుని ఏపీలో కూడా పబ్లిక్ హాలిడే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాలయాలు మూతపడనున్నాయి. ఇక ఫిబ్రవరి 27న ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విద్యాలయాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో 3, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.
Also read: TTD Member Video: తిరుమలలో మరో రచ్చ, థర్డ్ క్లాస్ నా కొడుకు అంటూ వీరంగం, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి