8th Pay Commission Big News: కొత్త వేతన సంఘం ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై ప్రభావం పడుతుంది. అదే సమయంలో ట్యాక్స్ విధానం మారితే మాత్రం అందరిపై ఎఫెక్ట్ పడుతుంది. కేంద్ర బడ్జెట్‌లో కొత్త ట్యాక్స్ స్లాబ్ ప్రకటించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆదాయం 12 లక్షల వరకూ ఉంటే జీరో ట్యాక్స్ అని ప్రకటించారు. అంటే ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే ఇటీవల కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు భారీగా పెరగనున్నాయి. అయితే మరి ఇప్పుడు ప్రకటించిన కొత్త స్లాబ్ విధానం ఈ 8వ వేతన సంఘంపై పడుతుందా లేదా అనే ప్రశ్న నెలకొంది. ఒకవేళ పడితే ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవాలి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 108 శాతం పెరుగుతాయి. ఇది కాస్తా 1.10 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. దీంతో పాటు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతం నుంచి 2.08 శాతం పెరగవచ్చు. అంటే కనీస వేతనం 18 వేల నుంచి 37, 440 రూపాయలు కానుంది. అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతమైతే కనీస వేతనం 51,480 రూపాయలకు పెరగవచ్చు.
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త ఇన్‌కంటాక్స్ విధానం ప్రకారం 12 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి 1 లక్ష కోట్లు భారం కానుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుతో ప్రభుత్వంపై మరో 2 లక్షల కోట్లు అదనపు భారం పడుతోంది.
8వ వేతన సంఘంపై కొత్త స్లాబ్ విధానం ప్రభావం చూపించనుంది. జీతాలు పెరిగి 12 లక్షల వరకూ చేరినా ఎలాంటి ట్యాక్స్ పడదు. అదే 12 లక్షలు దాటినా కూడా పాత ట్యాక్స్ విధానంతో పోలిస్తే ట్యాక్స్ తగ్గుతుంది.
Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు హోలీ కానుకగా డీఏ పెంపు, జీతం పెన్షన్ ఎంత పెరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి