8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ప్రతి సారీ వేతన సంఘం ఏర్పడినప్పుడు ద్రవ్యోల్బణ ఆధారంగా ఉద్యోగుల జీతభత్యాల పెంపు ఉంటుంది. దాంతో జీతాలు భారీగా పెరుగుతుంటాయి. ఇప్పుడు 8వ వేతన సంఘంతో జీతాలు ఎంత పెరుగుతాయనే ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. 2026 వరకూ ఉంటుంది. ఇటీవల కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2026 ఆఖరుకు ఇది అమల్లోకి రావచ్చు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ ఎంత పెరుగుతుందనే చర్చ ప్రారంభమైంది. కొంతమంది 108-186 శాతం కనీస వేతనం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంకొంతమంది 20-30 శాతం పెరుగుతుందని అంటున్నారు. దాంతో వాస్తవంగా ఎంత పెరుగుతుందనే సందిగ్ధంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016లో ప్రారంభమైంది. ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంటుంది. అందుకే 8వ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగులు జీతాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకం
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 1.92 నుంచి 2.08 మధ్యలో అనుమతించవచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకొందరైతే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతం ఉంటుందని అంటున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే అన్ని రెట్లు కనీస వేతనం పెరుగుతుంది. 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ఆ సమయానికి ఉద్యోగుల డీఏ 60 శాతానికి చేరుతుంది. ప్రస్తుతం కనీస వేతనం 18 వేలు ఉంది. దీనికి డీఏ కలిపితే 28,800 అవుతుంది.
ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 గా నిర్ణయిస్తే కనీస వేతనం 20 శాతం పెరిగి 34,560 రూపాయలు అవుతుంది. అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.08 శాతమైతే కనీస వేతనం 30 శాతం పెరిగి 37,440 రూపాయలు అవుతుంది. ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా ఉంటే కనీస వేతనం 51,480 రూపాయలు అవుతుంది. అంటే 80 శాతం పెంపు ఉంటుంది. దీనికి డీఏ కలిపి లెక్కేస్తే 1.92 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అయితే 92 శాతం, 2.08 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే 108 శాతం, 2.86 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే 186 శాతం పెరుగుదల కన్పిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి