8th Pay Commission News: 8వ వేతన సంఘం సిఫార్సులు ఎలా ఉంటాయనే అంశంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, జీతం పెంపు ఎంత ఉంటుందనే చర్చ నడుస్తోంది. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రభావం దేశవ్యాప్తంగా 6 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది ఉద్యోగులపై ఆదాయంపై పడనుంది. ఈ క్రమంలో 8వ వేతన సంఘం కమిటీ ఏర్పాటు ప్రక్రియ గురించి పరిశీలిద్దాం.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి వస్తుంది. అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం అమల్లో ఉంటుంది. వేతన సంఘం కొత్తగా ఏర్పడిన ప్రతిసారీ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరుగుతుంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8వ వేతన సంఘం కమిటీ ఏప్రిల్ నెలలో ఏర్పడవచ్చు. 8వ వేతన సంఘం ఏర్పాటు, ఆర్ధిక ప్రణాళికల గురించి కీలకమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. దీని ప్రకారం మరో రెండు నెలల్లో అంటే ఏప్రిల్ నెలలో కొత్త వేతన సంఘం ప్యానెల్ ఏర్పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రతిపాదనలు కేంద్రంలోని వివిధ శాఖలకు పంపించారు. అందరి అభిప్రాయాలు, సూచనల అనంతరం కమిటీ ఏర్పడనుంది.
వచ్చే ఆర్ధిక సంవత్సరం అంటే 2025-26లో కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రభావం ఉండదని సమాచారం. అంటే వేతన సంఘం సిఫార్సుల అమలు వచ్చే ఆర్ధిక సంవత్సరం అంటే 2026-27 నుంచే ఉండవచ్చు. కొత్త వేతన సంఘం ఏర్పడిన తరువాత ఆ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే అవి అమల్లోకి వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ ముగిసేసరికి వచ్చే ఆర్ధిక సంవత్సరం కావచ్చు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ జనవరి 16వ తేదీన ఆమోదం తెలిపింది.
దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంఘం అనేది 1947 నుంచి అమల్లో ఉంది. ప్రతి పదేళ్లకోసారి ఏర్పడుతుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016 నుంచి ప్రారంభమైది. 2026లో ముగియనుంది. కొత్త వేతన సంఘంలో మొత్తం ముగ్గురు ఉంటారు. ఒక ఛైర్మన్ ఇద్దరు సభ్యులతో ఈ కమిటీ కొనసాగుతుంది.
Also read: JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాలు, ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి