Salary DA Hike: 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఆనందంతో ఉన్నారు. మరో వైపు 12 లక్షల వరకూ ఆదాయంపై జీరో ట్యాక్స్ ప్రకటించడంతో చాలా ఉపశమనం పొందారు. ఇప్పుడు త్వరలో డీఏ మరోసారి పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ తగలనుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ పెంచనుంది. మార్చ్ నాటికి అంటే హోలీ బహుమతి అందించేందుకు సిద్ధమైంది. పెన్షనర్లకు డీఆర్ పెరగనుంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించడంతో చాలామంది ఉద్యోగులకు భారీ రిలీఫ్ లభించింది. ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రెండూ పెంచేందుకు నిర్ణయించింది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు డీఏ పెంచుతుంటారు. అదే సమయంలో పెన్షనర్లకు డీఆర్ పెరుగుతుంది. ఈ ఏడాది జనవరి డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఈ ప్రకటన హోలీ బహుమతిగా మార్చ్ నెలలో ఉంటుందని తెలుస్తోంది.
డీఏ పెంపుతో పాటు మరో శుభవార్త కూడా అందుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈపీఎఫ్ నుంచి గుడ్‌న్యూస్ ఇది. ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచేందుకు నిర్ణయించింది. 2024-5 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మార్చ్ నెలలో వడ్డీ రేట్లు పెరగవచ్చు. ఫిబ్రవరి 28న జరిగే సమావేశంలో వడ్డీ ఏ మేరకు పెరుగుతుందో తేలనుంది.
ఇక హోలీ నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ 3 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 53 శాతం అందుతోంది. ఇప్పుడు 3 శాతం పెరిగితే ఆ డీఏ 5 శాతం కానుంది. ఈ నిర్ణయం ద్వారా 69 లక్షల పెన్షనర్లు, 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. డీఏ అనేది ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి, జూలై నెలల్లో ఈ పెంపు ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ ఎంతనేది నిర్ణయిస్తుంటారు. జూలై నుంచి డిసెంబర్ వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం 3 శాతం డీఏ పెరుగుతుందని అంచనా. హోలీ పండుగ నాటికి మొత్తం మూడు నెలల డీఏ విడుదల కావచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరిగితే 18 వేలు కనీస వేతనం ఉన్నవారికి నెలకు 540 రూపాయలు పెరుగుతుంది. అదే 2.50 లక్షల వేతనం ఉన్నవారికి 7500 రూపాయలు పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు 270 రూపాయల నుంచి 3,750 రూపాయల వరకూ పెరుగుతుంది.
Also read: Earth Viral Video: తలకిందులవుతున్న భూమి, భూ భ్రమణం వీడీయో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి