DA Hike Announcement: 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందుతోంది. జనవరి 2025 డీఏ పెంపు ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చని ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే హోలీ నాటికి డీఏ ప్రకటన వెలువడవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రతి ఏటా రెండు సార్లు పెరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలలో పెంచాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడూ జనవరి పెంపు ప్రకటన మార్చ్‌లో, జూలై పెంపు ప్రకటన సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఉంటుంది. డీఏ అనేది కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ సూచీ ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతం ఉంది. ఈసారి డీఏ మరో 3 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మొత్తం డీఏ 56 శాతానికి చేరుతుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల ఏఐసీపీఐ సూచీ ఆధారంగా డీఏ నిర్ధారిస్తారు. ఇంకా నవంబర్, డిసెంబర్ సూచీ అందాల్సి ఉంది. అక్టోబర్ వరకు అందిన ఏఐసీపీఐ సూచీ ప్రకారం డీఏ 55 శాతం దాటింది. నవంబర్-డిసెంబర్ కలుపుకుంటే 56 శాతానికి చేరవచ్చు.
డీఏ 56 శాతం ఉంటే జీతంపై ఎలాంటి ప్రభావం పడుతుంది
కనీస వేతనం 18 వేలు ఉన్నవారికి 53 శాతం డీఏ 9,540 రూపాయలు అందితే 56 శాతం డీఏ ఉంటే 10,080 రూపాయలు లభిస్తాయి. అంటే నెలకు 540 రూపాయలు డీఏ పెంపు ఉంటుంది. అదే కనీస వేతనం 56,100 ఉన్నవారికి 53 శాతం డీఏ 29,733 రూపాయలు అందితే 56 శాతం డీఏ అయితే 31,416 రూపాయలు వస్తాయి. అంటే నెలకు 1683 రూపాయలు అందుతాయి. డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలో వెలువడినా జనవరి, ఫిబ్రవరి రెండు నెలల ఎరియర్లతో కలిపి చేతికి అందుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి