Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారా ఇన్ ఛార్జ్ మార్పు పెద్ద సంచలనంగా మారుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుండి ఇన్ మార్పు నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి దీపదాస్ మున్షీనీ తప్పించడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాల్సిన ఇన్ ఛార్జ్ ఆ విషయం పక్కన పెట్టి ఇతర అంశాలపై దృష్టి పెట్టిందని గాంధీ భవన్ లో గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే దీప్ దాస్ మున్షీనీ ఉన్న ఫళంగా మార్చారనే పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్ ఛార్జ్ హోదాలో ఉన్న దీపదాస్ మున్షీ పార్టీలో సమస్యలను చక్కబెట్టాల్సింది పోయి తానే ఒక పెద్ద సమస్యగా మారిందని పార్టీలో అనుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా దీపదాస్ మున్షీనీ కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా వచ్చిన కొత్తలో పార్టీనీ గాడిలో పెడుతుందని నేతలందరూ భావించారు.అంతే కాదు పార్టీలోని చాలా మంది నేతలు మున్షీతో కలిసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ...రాను రాను మున్షీలో చాలా మార్పు వచ్చిందంట. పార్టీలో తాను చెప్పినట్లే నడవాలనే ధోరణితో వ్యవహరించేదంట. పార్టీలోని సీనియర్లు కొందరు పార్టీ బలోపేతం గురించి సూచనలు చేస్తే వాటిని లెక్క చేయలేదని సమాచారం అంతే కాదు అలాంటి నేతలకు తర్వాత కాలంలో కలవడం కూడా మానేసిందంట. దీంతో వారు ఆగ్రహంతో అప్పట్లోనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
ఇదే ఇలా ఉండగానే పార్లమెంట్ కు ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల విషయంలో దీపదాస్ మున్షీ సరిగ్గా వ్యవహరించలేనేద ఆరోపణ కూడా ఉంది.టికెట్ల కేటాయింపులో అధిష్టానానికి సరైన సమాచారం ఇవ్వలేదని పార్టీలోనే అప్పట్లో బహిరంగంగా విమర్శించారు. డబ్బులకు టికెట్లు కేటాయించారేనే విమర్శలు కూడా ఆమెపై వినిపించాయి. ఎంపీ టికెట్ కోసం దీపదాస్ మున్షీ విలువైన బెంజ్ కారును బహుమతిగా తీసుకుందని అప్పట్లో బీజేపీ ఆమెపై సంచలన ఆరోపణ చేసింది. బీజేపీ చేసిన ఈ ఆరోపణ దేశ వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ గా మారింది. అంతే కాదు ఆమె తీరు కారణంగానే అధికారంలోకి ఉండి కూడా కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చిందని సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీపదాస్ మున్షీ కాస్తా సీరియస్ గా దృష్టి పెడితే మరో నాలుగు సీట్లు కాంగ్రెస్ కు వచ్చేవి అనేది సీనియర్లు భావన . ఇక అక్కడి నుంచి సీనియర్లకు, మున్షీకీ గ్యాప్ బాగా పెరిగింది. పార్టీలోని కొందరి నేతలతో మాత్రమే మున్షీ నిత్యం టచ్ లో ఉంటుందని మిగితా నేతలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే మరోవైపు గత కొద్ది నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల విషయంలో్ మున్షీ సరిగ్గా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల విషయం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ఏకంగా అధ్యక్షుడిపై గాంధీ భవన్ లోనే దాడికి యైత్ కాంగ్రెస్ నేతలు దిగే పరిస్థితికి వచ్చింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర పెద్దలు సరిగ్గా స్పందించలేదని పార్టీలో టాక్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం కూడా ఇంతలా వివాదం కావడానికి ఆమె తీరే అన్న విమర్శ ఉంది అంతే కాదు ఇటీవల కొందరు ఎమ్మెల్యే సొంత పార్టీకీ వ్యతిరేకంగా సమావేశం అవడం కూడా ఆమెను తీసివేయడానికి ప్రధాన కారణమైంది.ఎమ్మెల్యేలు భేటీ అయ్యేంత వరకు మున్షీ ఎందకు కామ్ గా ఉందని హై కమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాల్సిన మున్షీ తనకేమీ పట్టనట్లు ఉండడంపై అధిష్టానం గుర్రుగా ఉంది . ఇదే ఆమెను పార్టీ వ్యవహారాల నుంచి తప్పించడానికి ప్రధాన కారణమైనట్లు చర్చ.
దీనికి తోడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలపై ఆమె వ్యవహరించిన తీరు కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఆమె అనుమతి ఉంటేనే పార్టీలో చేరికలు జరగాలి లేకుంటే లేదని హుకుం కూడా జారీ చేసిందంట. దీంతో ఈమె కారణంగానే ఎమ్మెల్యేల చేరిక ఆలస్యమైందంట. అంతే కాదు చేరికల సమయంలో ఆయా నియోజకవర్గంలో ఉన్నా పాత నేతలను పూర్తిగా విస్మరించిందంట. పాత నేతలకు సమాచారం లేకుండానే బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేర్చుకోవడంతో పార్టీకీ లాభం కన్నా నష్టమే జరిగిందనే ప్రచారం ఉంది. పార్టీలో కొత్తగా ఎవరైనా చేరితే అది పార్టీనీ బలోపేతం అయ్యేలా ఉండాలి కానీ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందనేది పార్టీ సీనియర్ల అంచనా. పాతవాళ్ల ఆగ్రహం, కొత్తవాళ్ల అసంతృప్తి రెండు కలిసి పార్టీకీ నష్టం చేస్తున్నాయనేది పార్టీ నేతలు అనుకుంటున్నారు.వీటితో పాటు
మంత్రివర్గ విస్తరణ, పార్టీలో బీసీ వివాదం ,నామినేటెడ్ పదవులపై రడగ లాంటి అంశాల్లో దీప దాస్ మున్షీ తీరు సరిగ్గా లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఈమె తీరుతో పార్టీలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయనేది పార్టీలోని సీనియర్ల మాట.
గత కొన్ని నెలలుగా దీపదాస్ మున్షీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో హైకమాండ్ అలెర్ట్ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ పై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ సీనియర్లు, ఇతర నేతల నుంచి తీసుకున్న సమాచారం తర్వాత దీపదాస్ మున్షీనీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీపదాస్ మున్షీ స్థానంలో ఇప్పుడు కొత్తగా మీనాక్షి నటరాజన్ ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా నియమించింది. ఈ మొత్తం వ్యవహారంలో దీపదాస్ మున్షీ తన తీరుతోనే ఇలాంటి పరిస్థితి తెచ్చుకుందని గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తున్న చర్చ.మరి దీపదాస్ స్థానంలో వచ్చినటువంటి మీనాక్షికి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందోనని కూడా పార్టీ నేతలు అనుకుంటున్నారు. దీపదాస్ మున్షీ తర్వాత వస్తున్న మీనాక్షికి పార్టీలో అనేక సవాళ్లు ఎదురవ్వడం ఖాయం మరీ ఈ కొత్త ఇన్ ఛార్జ్ ఎలా డీల్ చేస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.