White Pepper: తెల్లమిరియాలు తింటే ఆ రోగాలు ఫసక్‌.. రక్తంలో షుగర్‌ కంట్రోల్‌..

White Pepper Benefits: సాధారణంగా మనం వాడే మిరియాలు నల్ల రంగులు ఉంటాయి. అయితే తెలుపు రంగులో ఉండే మిరియాలు కూడా అందుబాటులో ఉంటాయని మీకు తెలుసా? ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 17, 2025, 08:59 AM IST
White Pepper: తెల్లమిరియాలు తింటే ఆ రోగాలు ఫసక్‌.. రక్తంలో షుగర్‌ కంట్రోల్‌..

White Pepper Benefits: తెల్ల మిరియాలు నల్ల మిరియాలకు మధ్య తేడా ప్రాసెసింగ్ విధానంలో వేరుగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల మిరియాలు బాగా మాగిన తర్వాత తయారు చేస్తారు. ఆ తర్వాత ఎండబెడతారు. అయితే తెల్ల మిరియాలు మాత్రం మిరియాల గింజ పై లేయర్ తొలగించి ఆ తరువాత ఎండబెట్టి ఉపయోగిస్తారు. తెల్ల మిరియాల్లో మంచి ఆరోమెటిక్ గుణాలు ఉంటాయి. రుచికి కాస్త ఛేదుగా అనిపించినా నల్ల మిరియాలతో పాటు ఇందులో కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

తెల్ల మిరియాలను ఎక్కువ శాతం ఫ్రెంచ్ వంటల్లో కూడా ఉపయోగిస్తున్నారు. వంటల్లో కూడా దీని పాత్ర అద్భుతం. తెల్ల మిరియాలు ఉపయోగించడం వల్ల ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల సమస్య నుంచి నివారిణిగా పనిచేస్తుంది. ఇది ర్యూమటైడ్‌, ఆర్థరైటిస్ కి ఎఫెక్టివ్ రెమిడీ.

తెల్లమిరియాల్లో ఉండే ఫెనోలిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుందని నివేదిక తెలిపింది.. దీంతో ఇది నొప్పి సమస్యకు తక్షణ నివారణిగా కూడా పనిచేస్తుంది. మీరు తెల్ల మిరియాలను నొప్పి ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ పొందుతారు. ఇందులో క్యాప్సైసీన్‌ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించే గుణాలు కలిగి ఉంటుంది. దీంతో మీ బరువు నిర్వహణలో ఉంటుంది..అంతేకాదు తెల్ల మిరియాల్లో థెరపిటిక్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రొంప సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఇది ముఖ్యంగా రెస్పిరేటరీ సమస్యలైనా జలుబు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి..

ఇదీ చదవండి : విద్యార్థులకు శుభవార్త.. నేడు ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!  

ఇది మాత్రమే కాదు తెల్ల మిరియాలు తరచూ ఉపయోగించడం వల్ల ఇందులో ఉండే సిమెంట్ కడుపులో వచ్చే అల్సర్ సమస్యకు నివారిస్తుంది.. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది .తెల్ల మిరియాలలో ఉండే పెప్పరిన్ వల్ల తలనొప్పి సమస్య కూడా తగ్గిపోతుంది.

 ముఖ్యంగా తెల్ల మిరియాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇందులోని పాలిఫైనల్స్ ఆక్సిడెంట్ నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. దీంతో ఫ్రీరాడికల్ సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.. ముఖ్యంగా ఇందులో ఉండే పెప్పరీన్‌ ఫ్లెవనాయిడ్స్‌ వల్ల రక్తంలో బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుంది.. రక్త సరఫరాను మెరుగు చేస్తుంది.

ఇదీ చదవండి : జియో రూ.355 ప్లాన్‌.. ప్రతిరోజూ అన్‌లిమిటెడ్‌ డేటా, ఫ్రీ కాలింగ్‌ మరిన్ని బెనిఫిట్స్‌..  

అంతేకాదు తెల్ల మిరియాలు యాంటీబయోటిక్ గుణాలు కూడా కలిగి ఉంటాయి. ఇది గ్లైసెమిక్‌ స్థాయిలను తగ్గించి రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. తెల్ల మిరియాలను కర్కుమిన్ తో కలిపి తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల పంటి నొప్పి సమస్య కూడా తగ్గిపోతుంది. తెల్ల మిరియాల్లో ఉండే పెప్పరిన్ వల్ల ఇది మెలోనోసైట్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో మీ చర్మంపై ఉండే పిగ్మెంటేషన్ తగ్గిపోవడమే కాకుండా వర్టిలిగో చర్మసమస్యను నయం చేస్తుంది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News