Foot Care: చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు చాలా కామన్. ఈ సీజన్లో వచ్చే అనేక చర్మ సమస్యలలో కాళ్ల పగుళ్లు కూడా ఒకటి. శరీరంలో తేమ శాతం తగ్గడం వల్ల చర్మం పొడిబారి పోవడంతో పాటు గరుకుగా తయారవుతుంది. శీతాకాలంలో వీచే చల్లని గాలులు కారణంగా మన చర్మం డ్రై అవ్వడంతో కాళ్లలో పగుళ్లు సులభంగా ఏర్పడతాయి. పైగా ఈ సీజన్ కాళ్ళ మధ్య అక్కడక్కడ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ చక్కటి పరిష్కారం మనం ఇంటి నుంచే చేసుకోవచ్చు. మరి అదేమిటో తెలుసుకుందాం పదండి.
శీతాకాలంలో నేలమీద దుమ్ము అంత సులభంగా పోదు. ఈ కారణం చేత కాళ్లు త్వరగా పగిలిపోతాయి. అందుకే మనం బయటకు వెళ్లేటప్పుడు పాదాలు బాగా కవర్ చేసే విధంగా షూస్ ధరించడం ఉత్తమం. ఇక రోజు పడుకునేటప్పుడు కాళ్ళను శుభ్రంగా కడుక్కొని మాయిశ్చరైజర్ వంటివి రాసుకోవడం మర్చిపోకూడదు. ఇలా చేయడం వల్ల కాళ్లల్లో సహజంగా తేమశాతం మెయింటైన్ అవ్వడమే కాకుండా కాళ్ళు మృదువుగా ఉంటాయి. మాయిశ్చరైజర్ వద్దు అనుకున్న వాళ్లు రోజు పడుకునే ముందు కాళ్ళను కాస్త గోరువెచ్చటి కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవచ్చు.
అలాగే వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటిలో కాస్త బేకింగ్ సోడా, ఒక చెంచా షాంపూ, అర చెంచా నిమ్మరసం కలిపి పాదాలను కాసేపు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పాదాలు దగ్గర చర్మంపై మృత కణాలు తొలగిపోవడంతో పాటు.. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి. పాదాలు మరీ తెలుసు బారినట్టుగా ఉంటే కాస్త పెరుగుతో మర్దన చేసి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారడంతో పాటు మృదువుగా తయారవుతుంది.
ప్రస్తుతం క్రాకెడ్ ఫీట్ కోసం.. కొవ్వొత్తి మైనంతో చేసిన ప్యాక్ ను వాడడం బాగా ట్రెండింగ్ లో ఉంది. దీనికోసం ఒక గిన్నెలో వేడి నీటిని పోసి అందులో ఒక చిన్న గిన్నె పెట్టి.. ముక్కలుగా కట్ చేసిన మైనాన్ని అందులో వేసి కరిగించాలి. దీన్ని డబల్ బాయిలర్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు. ఇలా కరిగించిన మైనంలో రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. కొబ్బరి నూనె బదులు ఆలివ్ ఆయిల్ లేక బాదం నూనె కూడా వాడవచ్చు.
ఈ మిశ్రమంలో ఒక చెంచా వ్యాజలైన్ కూడా కలపాలి. బాగా కలిపిన ఈ మిశ్రమానికి కాస్త ఆముదం అలోవెరా జెల్ ఆడ్ చేసి పాదాలకు క్రీం లాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు ఎంతో మృదువుగా మారుతాయి. ఈ క్రీమ్ ని ఫ్రిజ్‌లో వారం పాటు నిల్వ చేసుకోవచ్చు. అయితే వాడడానికి ముందు కాస్త గోరువెచ్చగా వేడి చేసి అప్లై చేస్తే సరిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ పగుళ్లు తగ్గించుకోవడానికి ఈ కొత్త రకం ప్యాక్ ని ఉపయోగించండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది .కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook