Peach: పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలుసా? వారం రోజులు తిని చూడండి..

Peach Fruit Benefits: పీచ్‌ పండును స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పసుపు, తెలుపు రంగులో ఉండే ఈ పండుతో ఆరోగ్యమైనకరమైన ప్రయోజనాలు పుష్కలం. వీటిని జ్యూస్ రూపంలో నేరుగా కూడా తినవచ్చు. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ..

Written by - Renuka Godugu | Last Updated : Feb 5, 2025, 09:30 AM IST
Peach: పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలుసా? వారం రోజులు తిని చూడండి..

Peach Fruit Benefits: పీచ్ పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన పండు. పోషకాలు పుష్కలం ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది. పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

వెయిట్ లాస్..
బరువు తగ్గాలనుకునేవారు పీచ్‌ పండును డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వర్కౌట్ చేసిన తర్వాత స్నాక్ రూపంలో కూడా పీచ్‌ పండును తీసుకోవచ్చు. నేరుగా తినొచ్చు లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు. పీచ్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అధిక తినాల్సిన కోరిక రాదు. అయితే ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

కంటి ఆరోగ్యం..
పీచ్‌ పండులో విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటీన్‌ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన కంటి చూపును మెరుగుపరిచి ఇది క్యాటరాక్ట్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. 

జీర్ణ ఆరోగ్యం..
పీచ్‌ పండులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుందని అమెరికన్ నివేదికలు తెలుపుతున్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అంతేకాదు డయేరియా, మలబద్దక సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.

ఇదీ చదవండి:  భానుడి భగభగలు షురూ.. నేటి నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు..  

చర్మ రక్షణ..
పీచ్‌ పండును తీసుకోవటం వల్ల హానికరమైన అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కూడా మన చర్మాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పీచ్ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు అయినా విటమిన్ సీ, బీటా కెరోటీన్‌ ఉంటుంది. ఇది మన చర్మ ఆరోగ్యకరమైన కనిపించేలా చేస్తుంది.

అంతేకాదు పీచ్‌ పండులో పాలిఫెనల్స్, యాంటీ  ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది నొప్పి సమస్యలను తగ్గించుతాయి. అంతేకాదు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.. దీంతో సీజనల్ జబ్బులు మీ దరిచేరకుండా ఉంటాయి .

ఇదీ చదవండి: రథసప్తమి.. సూర్యప్రభ వాహనంపై శ్రీ కోదండరామస్వామి కటాక్షం..   

పీచ్‌ పండు క్యాన్సర్ కణాలు అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. మోనోపోజ్ మహిళలు కనీసం రెండు పీచు పండ్లు అయినా రోజుకు తినాలి. గుండె ఆరోగ్యం కోసం పీచ్‌ పండ్లు తినాలి. ఇందులో పొటాషియం పుష్కలం. దీంతో రక్తపోటు హఠాత్తుగా పెరగకుండా ఉంటుంది.. ఆరోగ్యకరమైన గుండెకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, ఫోలేట్ ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా మేలు చేస్తుంది.  పీచ్‌ పండ్లను నేరుగా తినవచ్చు.. లేదా స్మూథీ రూపంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా యోగార్ట్‌తో కలిపి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News