Inadequate Sleep: మీరు సరిగా నిద్రపోవట్లేదా.. తగినంత నిద్ర లేకపోతే ఈ 6 ఆరోగ్య సమస్యలు తప్పవు...

Inadequate Sleep Causes These Health Problems: మీరు సరిగా నిద్రపోవట్లేదా.. రోజుకు కనీసం 7 గంటలైనా నిద్ర పోకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు.. అవేంటో ఇక్కడ తెలుసుకోండి  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 2, 2022, 10:30 AM IST
  • తగినంత నిద్ర లేకపోతే వచ్చే సమస్యలు
  • జుట్టు, చర్మ సమస్యలు
  • పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
Inadequate Sleep: మీరు సరిగా నిద్రపోవట్లేదా.. తగినంత నిద్ర లేకపోతే ఈ 6 ఆరోగ్య సమస్యలు తప్పవు...

Inadequate Sleep Causes These Health Problems: ప్రతీ మనిషికి రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. అప్పుడే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండగలడు. ఎప్పుడైతే నిద్ర సరిగా ఉండదో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. గతంలో వెలువడిన పలు సర్వేల్లో నిద్రలేమితో బాధపడే వ్యక్తులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా టాప్ 2 స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. నిద్ర లేమి లేదా తగినంత నిద్ర లేకపోవడం వల్ల చాలామంది జుట్టు, చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జట్టు రాలిపోవడం

నిద్రలేమి సమస్య శరీరంలో హార్మోన్ల మార్పులకు కారణమవుతుంది. శరీరంలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (హెచ్‌జీహెచ్) తగినంత స్థాయిలో ఉత్పత్తి అవదు. దీంతో జుట్టు రాలడం మొదలవుతుంది. శరీరంలో తక్కువ హెచ్‌జీహెచ్ ఉండటం కుదర్లను బలహీనపరుస్తుంది. దీంతో జుట్టు పొడిబారిపోయి, బలహీనపడి రాలిపోతుంది.

జుట్టు పాలిపోవడం

తగినంత నిద్ర లేకపోతే జుట్టు రంగు కూడా మారిపోయే అవకాశం ఉంది. నిద్ర లేమితో శరీరంలో eumelanin హార్మోన్ తగినంత ఉత్పత్తి అవదు. దీంతో జుట్టు నలుపు రంగు నుంచి బూడిద రంగులోకి మారుతుంది. 

గోర్లు చిట్లిపోవడం 

తగినంత నిద్ర లేకపోతే చేతులు, కాళ్ల గోర్లు కూడా చిట్లిపోతాయి. కొన్నిసార్లు గోర్లు బాగా చిట్లిపోతే చాలా నొప్పి వస్తుంది. ఇది మానిపోవడానికి చాలా సమయం పడుతుంది.

చర్మంపై ముడతలు

శరీరానికి తగిన నిద్ర లేకపోతే చర్మంపై ముడతలు, చర్మం పొడిబారడం, చర్మంపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడటం జరుగుతుంది. త్వరగా ముసలివాళ్లలా కనిపిస్తారు.

జిడ్డు, మొటిమలు 

తగినంత నిద్రలేనివారిలో ముఖంపై ఎప్పుడూ జిడ్డు కారుతుంది. మొటిమలు పెరుగుతాయి. ఎప్పుడైతే నిద్ర సరిగా ఉంటుందో ఈ సమస్యలేవీ దరిచేరవు.

కళ్ల కింద నల్లటి వలయాలు 

నిద్ర సరిగా లేకపోతే కళ్ల కింద నల్ల వలయాలు కూడా ఏర్పడుతాయి. కళ్లు పొడిబారి దురద వస్తాయి. కొన్నిసార్లు కనుగుడ్డు పసుపు రంగులోకి మారవచ్చు. అది కంటి చూపుపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉండొచ్చు. 

Also Read :Kcr New Scheme: ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ కొత్త స్కీం.. దసరా నుంచి అమలు! గులాబీ పండగేనా..

Also Read: Prakasam: అర్ధరాత్రి పెను ప్రమాదం.. లారీలో పేలిపోయిన వందల గ్యాస్ సిలిండర్లు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News