Asanas For Constipation: ఈ రెండు ఆసనాలు చాలు మలబద్ధకం మటుమాయం అవటానికి!

Yoga Asanas for Constipation: ఆధునిక జీవితంలో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురౌతున్న వ్యాధుల్లో మలబద్ధకం ప్రధానమైంది. ఎందుకంటే మలబద్ధకం ఒక్కటే మరెన్నో సమస్యలకు కారణమౌతుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2023, 07:58 PM IST
Asanas For Constipation: ఈ రెండు ఆసనాలు చాలు మలబద్ధకం మటుమాయం అవటానికి!

Yoga Asanas for Constipation: రోజూ మలబద్ధకం సమస్య ఉంటే కచ్చితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య నుంచి గట్టెక్కాల్సి ఉంటుంది. మల బద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మలబద్ధకం సమస్య వెంటాడుతుంటుంది. ఇటీవలి కాలంలో ఫాస్ట్‌ఫుడ్స్ వల్ల ఈ సమస్య మరింతగా పెరిగిపోయింది. మలబద్ధకం సమస్య శరీరంలో ఎన్నో ఇతర సమస్యలకు కారణమౌతుంది. అందుకే ముందు మలబద్ధకం సమస్యను దూరం చేయాలి. మలబద్దకం సమస్యను దూరం చేయాలంటే డైట్ బాగుండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఈ రెండూ పాటిస్తే కచ్చితంగా మల బద్ధకం సమస్య దూరమౌతుంది. మల బద్ధకం కారణంగా తలెత్తే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమౌతాయి. 

తాడాసనం

ఈ ఆసనం మలబద్ధకం సంబంధిత వ్యాధుల్ని దూరం చేయడంలో దోహదపడుతుంది. ఈ ఆసనం వేసేందుకు ముందు నిటారుగా నిలుచోవాలి. రెండు చేతుల వేళ్లను ఒకదానితో మరొకటి బంధించి పైకి లేపాలి. ఆ తరవాత బ్యాలెన్స్ కాలి పంజాలపై ఉంచి అలానే నిలబడాలి ఇప్పుడు చేతుల్ని నెమ్మది నెమ్మదిగా కిందకు దింపి రిలాక్స్ కావాలి. ఈ యోగాసనం వల్ల శరీరంలో బ్యాలెన్స్‌‌తో పాటు కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ఉదయం పరగడుపున చేస్తే మంచి ఫలితాలుంటాయి.

వజ్రాసనం

ఎప్పుడు భోజనం చేసిన వజ్రాసనం స్థితిలో కూర్చుని తింటే మంచిది. దీనివల్ల మలబద్ధకం సమస్య పోతుంది. ఈ స్థితిలో కూర్చోవాలంటే చాపపై మోకాళ్లు మడిచి కూర్చోవాలి. మీ నడుము భాగం నిటారుగా ఉంచాలి. కాలి మడమల్ని కలిపి ఉంచాలి. ఆ తరువాత రెండు చేతుల్ని మోకాలిపై ఉంచాలి. ఇలా కాస్సేపు కూర్చుని లోతుగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. 

Also Read: Skin Care Tips: ముఖంపై ముడతలు పోయి కళకళలాడాలంటే రోజూ ఇది వాడాల్సిందే

Also Read: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీకి షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News