Fruits Storage:ఈ పండ్లు పొరపాటున కూడా ఫ్రిజ్ లో పెట్టకండి..

Fruits: ఒక్కసారి తెచ్చుకుంటే టైం కలిసి వస్తుందని చాలామంది ముందుగానే పండ్లు కూరగాయలు లాంటివి తెచ్చి ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తారు. అయితే కొన్ని రకాల పండ్లు అస్సలు ఫ్రిజ్లో పెట్టకూడదు అంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఈ పండ్లు విషం తో సమానం అవుతాయట .మరి అవేమిటో తెలుసుకుందామా..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 10:00 PM IST
Fruits Storage:ఈ పండ్లు పొరపాటున కూడా ఫ్రిజ్ లో పెట్టకండి..

Refrigerator: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి .. బిజీ లైఫ్ కారణంగా.. మనలో చాలామంది కూరగాయలు, పండ్లు, కావలసిన సామాన్లు ఒక్కసారిగా తెచ్చి పెట్టుకోవడానికి ఇష్టపడతాం. ఇలా చేయడం వల్ల సమయం కలిసొస్తుంది అనుకుంటాం .తెచ్చిన కూరగాయలను ,పండ్లను జాగ్రత్తగా ఫ్రిజ్లో నిల్వ చేస్తాం .ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అవి ఎక్కువ కాలం చెడకుండా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే ..కానీ కొన్ని రకాల పండ్లు ఫ్రిజ్లో అసలు పెట్టకూడదు .మరి ఆ పండ్లు ఏమిటో? వాటిని ఎందుకు ఫ్రిజ్లో పెట్టకూడదు తెలుసుకుందాం?

అరటి పండ్లు:

అరటిపండు.. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా తినదగిన పండు. దీనివల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభించడంతోపాటు పలు రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అయితే అరటిపండు రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల అది నల్లగా మారడమే కాకుండా అందులోని ఇథిలీన్ గ్యాస్ బయటకు వస్తుంది. దీని కారణంగా ఫ్రిడ్జ్ లో ఉంచిన మిగిలిన పండ్లు కూడా త్వరగా మక్కిపోతాయి. అందుకే అరటిపండుని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో లేక ఇతర పండ్లతో పాటు కలిపి పెట్టకూడదు. అంతేకాదు చాలామంది ఇంట్లో ఎప్పుడూ అరటిపండు స్టోరేజ్ లో పెట్టుకోవడం వల్ల వాటిని ఎక్కువగా ఫ్రిజ్లో పెట్టేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అరటి పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్ట కూడదు. కొంతమందికి ఫ్రిజ్ లో ముందే అరటిపండ్ల తినడం వల్ల అరుగుదల సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ:

వేసవికాలం వచ్చింది అంటే పుచ్చకాయ ఫెస్టివల్ మొదలవుతుంది. వేసవి తాపాన్ని తగ్గించే ఈ పండుని చాలామంది ఇష్టంగా తింటారు. అయితే సైజు చాలా పెద్దది కాబట్టి ఒకేసారి తినలేము.. అందుకని ఎక్కువగా రిఫ్రిజిరేటర్ లో దీన్ని భద్రపరుస్తాం. అయితే ఇలా పెట్టడం వల్ల పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు పాడైపోతాయి. తినడానికి కాస్త సమయం ముందు ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రాబ్లం లేదు కానీ అలాగే రోజుల తరబడి కోసిన పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్లో ఉంచకూడదు.

యాపిల్:

యాపిల్‌ ను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల అందులో ఉన్న క్రియాశీల ఎంజైన్స్ కారణంగా అది త్వరగా పాడవుతుంది. అందుకే యాపిల్స్‌ను ఎప్పుడు ఫ్రిజ్లో ఉంచకూడదు. ఎక్కువకాలం పాడుకాకుండా నిల్వ చేసుకోవాలి అంటే కాగితంలో చుట్టి జాగ్రత్తగా బయటే ఉంచాలి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News