Empty Stomach Foods: ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలామంది ఏది పడితే అది తింటూ ఉంటారు. మరి కొంతమంది అయితే తినకూడని చక్కెర పదార్థాలు కూడా విపరీతంగా తింటూ ఉంటారు. ఇవే మన శరీరానికి తీవ్ర హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందికైతే నిద్ర లేవగానే వెంటనే కాఫీ తాగే అలవాటు కూడా ఉంటుంది. మరి కొంతమంది అయితే ఖాళీ కడుపుతో టీ తో పాటు ఎక్కువ నూనెతో కూడిన ఆహారాలు తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చాలామంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలనే ఉదయాన్నే అతిగా తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి ఇలా తినడం వల్ల కడుపులో ఆమ్లాలు తీవ్రంగా ఉత్పత్తి అవుతాయి.
దీనివల్ల పొట్టలో వాపుతోపాటు గ్యాస్ట్రిక్ ఇతర సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది లోనైతే ఖాళీ కడుపుతో టీలు తాగడం వల్ల తలనొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఎన్నో ఉన్నాయి.. కానీ వీటి గురించి ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు. కాళీ కడుపుతో రోజు ఉదయం తినకూడని ఆహారాలు ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే స్వీట్లు తినడం:
కొంతమంది ఉదయాన్నే విచ్చలవిడిగా చాక్లెట్లతో పాటు అతిగా స్వీట్లు తింటూ ఉంటారు. దీనివల్ల రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి.. ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేసి పెంచేస్తూ ఉంటాయి. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఇలా ఉదయాన్నే స్వీట్స్ తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి.. అధిక బరువుకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలోనైతే తీవ్రంగా కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగి.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరుగుతో కూడిన ఆహారాలు:
కొంతమంది అయితే ఉదయాన్నే పరగడుపున అన్నంలో పెరుగు కలుపుకొని తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం వల్ల కూడా శరీరంలోని అనేక మార్పులకు దారితీస్తుంది. ఇలా పెరుగుతో తినడం వల్ల పొట్టలో ఆమ్లాలు పెరిగి అనేక రకాల పుట్ట సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా కడుపులో మంట, గ్యాస్టిక్ వంటి సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు అంటే ఇష్టం ఉండేవారు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
టాబ్లెట్స్ వేసుకోవడం..:
కాళీ పొట్టతో రోజు టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కొంతమందిలోనైతే రక్తస్రావంతో పాటు అల్సర్ ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఖాళీ కడుపుతో టాబ్లెట్స్ వేసుకునేవారు.. తప్పకుండా దీనిని గమనించి మార్పులు చేర్పులు చేసుకోవడం ఎంతో మంచిదని కొంతమందికి డాక్టర్లు సూచిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఇవి తినకండి..:
కొంతమందికి ఉదయాన్నే లేవగానే అరటి పండ్లను తినడం అలవాటు ఉంటుంది. నిజానికి అరటి పండ్లను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తంలో ఆకస్మికంగా అనేకమార్పులకు దారితీస్తుంది. దీనివల్ల సులభంగా గుండె దెబ్బ తింటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అరటి పండ్లు అంటే ఎంతో ఇష్టపడేవారు తప్పకుండా సాయంత్రం లేదా భోజనం వేళలో తీసుకోవడం ఎంతో మంచిదని వారంటున్నారు. అరటిపండుతో తయారుచేసిన స్మూతీలు తాగే క్రమంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి