Tips To Reduce Bad Cholesterol: ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. దీని కారణం మనం తీసుకొనే ఆహారం, మారిన జీవనశైలి అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలు రావడానికి మరో కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండటం ఒకటి. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండెపోటు సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది జీమ్, డైట్, మందులు వంటివి ఉపయోగిస్తారు. కానీ వీటితో ఎలాంటి లాభాలు ఉండవు. చెడు కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం మీరు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక వైద్యం. ఆయుర్వేదం చిట్కాలు పాటించడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎలాంటి ఆయుర్వేదం చిట్కాలను పాటించాల్సి ఉంటుంది అనేది తెలుసుకందాం.
కొలెస్ట్రాల్ తగ్గించే ఆయుర్వేద చిట్కాలు:
1 శొంఠి: చెడు కొలెస్ట్రాల్ సమస్యను తగించడంలో శొంఠి కీలక ప్రాత పోషిస్తుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. శొంఠిని ఎక్కువగా వంటల్లోకి ఉపయోగిస్తారు. ఇది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా కీల్ల నొప్పులు, వాపులు, జీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది. మీరు కూడా శొంఠిని ఉపయోగిచండి.
2 పసుపు: పసుపు మన నిత్య జీవనంలో ఉపయోగించే పదార్థం. ఇందులో కర్కుమిన్ అనేది ఉంటుంది. ఇది శరీరానికి ఔషధం వంటిది. పసుపు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ పసుపు కలుపుకొని తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.
3 అశ్వగంధ: అశ్వగంధ ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధం. ఇది మొండి చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు వేడి పాల్లో ఒక స్పూన్ అశ్వగంధను ఉపయోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో కీలక ప్రాత పోషిస్తాయి.
4 గుగ్గిలం: గుగ్గిలం అనేది ఆయుర్వేదంలో ఒక పదార్థం. ఇది చెడు కొలెస్ట్రల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీని ఉపయోగించే ముందు ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. గుగ్గిలం అనేది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు తలనొప్పి, ఇతర సమస్యలను కూడా నివారిస్తుంది.
5 త్రిఫల: త్రిఫల ఆయుర్వేదంలో ఉపయోగించే పొడి. ఇందులో బోలెడు పోషక గుణాలు ఉంటాయి. దీని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. ఇది కేవలం కొలెస్ట్రాల్‌ను తొలగించడంతో పాటు శరీరానికి ఎంతో సహాయపడుతుంది. మీరు కూడా దీని ప్రతిరోజు ఉపయోగించడం చాలామంచిది.
6 మెంతి నీరు: మెంతులు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. ఇందులో ఉండే ఆరోగ్య గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం సహాయపడుతాయి. ప్రతిరోజు మెంతి నీరు తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: HMPV Alert: బెంగళూరులో చైనా వైరస్, అప్రమత్తమైన పొరుగు రాష్ట్రాలు, హై అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.