Reduce Sugar Levels: మారుతున్న బిజీ లైఫ్ స్టైల్.. ఆహారంలో మార్పులు.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. శారీరక శ్రమ లేకపోవడం.. తీవ్రమైన ఒత్తిడి..అధిక ఆలోచనలు లాంటి తదితర కారణాలవల్ల చిన్న వయసులోనే చాలామంది డయాబెటిక్ బారిన పడుతున్నారు.
ఇది వచ్చిందంటే తగ్గించుకోవడమే తప్ప శాశ్వతంగా పరిష్కరించుకోలేము.అందుకే డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి.. చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇష్టమైన ఆహారాలను.. కూడా వదిలేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ల వద్దకు ప్రతినెలా తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు..అయితే వంటింట్లో దొరికే వస్తువులతోనే డయాబెటిక్ ని అదుపులోకి తీసుకురావచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు... వీటివల్ల మనం డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం చాలావరకు రాదట. పైగా ఇష్టమైన ఆహారాలను కూడా మితంగా తినవచ్చు అని సలహా ఇస్తున్నారు కూడా.. మరి డయాబెటిక్ పేషెంట్లకు ఆ అద్భుతమైన ఔషధం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
లవంగాలతో డయాబెటిస్ కి చెక్..
లవంగాలు.. ప్రతి ఒక్కరి వంటింటిలో పోపు డబ్బాలో లభించే లవంగాలు గురించి వాటి ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. లవంగాలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా దూరం చేస్తాయి.. ఇందులో ఉండే ఐరన్ , క్యాల్షియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మాంగనీస్, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్ ,విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.. నైజీరిసిన్ అనే ఒక సమ్మేళనం డయాబెటిస్ ను నివారించడంలో,నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో, ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడంలో, కూడా సహాయం చేస్తుంది.. ఫలితంగా రక్తంలోని చక్కర స్థాయిలు తగ్గి డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచుతుంది.
డయాబెటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధులు కూడా దూరం..
లవంగాలలో మనకు క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మినరల్స్ తో పాటు విటమిన్స్ కూడా లభించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా రక్షించడానికి ఈ లవంగాలు సహాయపడతాయి.. ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అలాగే జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. సులభంగా బరువు కూడా తగ్గవచ్చు ..ఇక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు లవంగాలను తినడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు.. క్రమం తప్పకుండా ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల కడుపు ఉబ్బరం, ఆయాసం, ఒత్తిడి , వాతావరణం వల్ల వచ్చి సీజనల్ వ్యాధులు కూడా దూరం అవుతాయి. అంతేకాదు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.. చిగుళ్ళు బలపడతాయి. దగ్గుకు మంచి మందు. ఇక మీరు కూడా డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచుకోవాలి అనుకుంటే లవంగాలను ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోవాలి.
Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం
Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి