Corona New Variant: యూరప్ దేశాల్ని కలవరపెడుతున్న కరోనా వేరియంట్ ఇండియా వచ్చేసింది

Corona New Variant: కరోనా మహమ్మారి భయం మళ్లీ వెంటాడుతోంది. యూరప్ దేశాల్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఇండియాను కూడా తాకింది. ముంబైలో తొలి కేసును గుర్తించడం ఆందోళన కల్గిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2023, 08:26 PM IST
Corona New Variant: యూరప్ దేశాల్ని కలవరపెడుతున్న కరోనా వేరియంట్ ఇండియా వచ్చేసింది

Corona New Variant: ప్రపంచాన్ని రెండేళ్లపాటు గడగడలాడించిన కరోనా వైరస్ ఇక లేదనుకుని అంతా ఊపిరిపీల్చుకునేలోగా మళ్లీ కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్‌లో గుర్తించిన ఈ కొత్త వేరియంట్ యూరప్ దేశాల్ని భయపెడుతోంది. ఇప్పుడీ వైరస్ ఇండియాకు సైతం వ్యాపించడం అత్యంత ఆందోళనకరంగా మారింది.

ప్రపంచ దేశాల్లో ఇప్పుుడు మళ్లీ కరోనా భయం భయం గొలుపుతోంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌గా ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బ్రిటన్‌లో తొలిసారిగా గుర్తించిన కరోనా కొత్త వేరియంట్‌ను EG5.1 లేదా ఎరిస్‌గా నామకరణం చేశారు. బ్రిటన్ హెల్త్ ఏజెన్సీల ప్రకారం జూలై 3వ తేదీన ఎరిస్ తొలిసారి అంతర్జాతీయంగా కోవిడ్ కొత్త వేరియంట్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిపై ఫోకస్ పెడుతోంది. 

ఈ కొత్త వేరియంట్ వేగంగా అయితే వ్యాపిస్తోంది కానీ ఎంతవరకూ ప్రమాదకరమనేది ఇంకా స్పష్టత లేదు.  7 కొత్త కరోనా వేరియంట్లలో ఇదొకటి. సేకరించిన 4 వేల శాంపిల్స్‌లో 5.4 శాతం కోవిడ్ 19 గా తేలాయి. బ్రిటన్‌లో ప్రతి 7 కరోనా కేసుల్లో ఒకరికి ఎరిస్ వేరియంట్ లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ కొత్త వేరియంట్ ముప్పు అన్ని వయస్సులవారికి ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులపై మరింత ఎక్కువగా ఉండనుంది. వృద్ధులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని తెలుస్తోంది. ముక్కు కారడం, తలనొప్పి, అలసట, తుమ్ములు రావడం, గొంతు పాడవడం కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ లక్షణాలుగా ఉన్నాయి.

ఇప్పుడీ వైరస్ ఇండియాను కూడా తాకింది. మహారాష్ట్రలో తొలికేసును గుర్తించారు. దేశంలో తొలిసారిగా ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఈ నెలలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలో ఈ నెలలో 115 మందికి కరోనా వైరస్ ఉందని తేలింది. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులకు కారణం కొత్త వేరియంట్ ఎరిస్ అని తెలుస్తోంది. మహారాష్ట్రలో కరోనా సోకిన ఒక వ్యక్తికి చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో ఎరిస్‌గా గుర్తించారు. ఇంకా మిగిలినవారికి కూడా జీనోమ్ పరీక్షలు చేస్తే ఇంకెంతమందికి ఉందో తెలుస్తుంది.

Also read: Reduce Ldl Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్‌ను కరిగించి బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టే డ్రింక్స్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News