Bird Flu: చికెన్‌ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందా? మనుషుల్లో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Bird Flu Symptoms: తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ భయంతో బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్‌ఫ్లూ.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వ్యక్తికి సోకింది. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. మనుషుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? తెలుసుకోండి

Written by - Renuka Godugu | Last Updated : Feb 13, 2025, 11:31 AM IST
Bird Flu: చికెన్‌ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందా? మనుషుల్లో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Bird Flu Symptoms: ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి చాలామందిలో ఉంది. ఏవైనా పార్టీ, ఫంక్షన్లు అంటే ముక్కా సుక్కా ఉండాల్సిందే. అందులో చికెన్‌ అంటే చాలామందికి ఇష్టం, ఎంతో టేస్టీగా ఉంటుంది కూడా.. కానీ, ఇప్పుడు చికెన్‌ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. బర్డ్‌ ఫ్లూ వ్యాధి విస్తరించడంతో చికెన్‌ తినడానికి జంకుతున్నారు.

అయితే, ఇప్పటి వరకు జంతువులకు సోకిన బర్డ్‌ఫ్లూ (Bird flu) తాజాగా ఏపీలోని ఓ వ్యక్తికి సోకింది.  దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవువుతన్నారు. మనుషుల్లో బర్డ్‌ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మనషుల్లో బర్డ్‌ ఫ్లూ లక్షణాలు ఇవే..
మనుషుల్లో బర్డ్‌ ఫ్లూ లక్షణాలు ముందుగానే గుర్తించవచ్చు. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం బర్డ్‌ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి.
1. చనిపోయిన లేదా బర్డ్‌ ఫ్లూ సోకిన పక్షులను తాకితే లేదా డైరెక్ట్‌ కాంటాక్ట్‌ వల్ల మనుషులకు వైరస్‌ సోకుతుంది.

2. బర్డ్‌ ఫ్లూ మరో లక్షణం కండరాల నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

3. బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకితే విపరీతమైన దగ్గు, ఊపిరి ఆడకపోవడం, అతిసారం లక్షణాలు కూడా కనిపిస్తాయి.

4. బర్డ్‌ ఫ్లూ ఇన్పెక్షన్‌ సోకితే వాటి తాలుకా లక్షణాలు మనుషుల్లో మూడు నుంచి ఐదు రోజుల మధ్య బయటపడతాయి. 

అయితే, బర్డ్‌ ఫ్లూ వైరస్‌ మనుషులకు సోకితే చనిపోయే ప్రమాదం చాలా అరుదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  బర్డ్‌ ఫ్లూ వ్యాధికి నివారించడానికి ఇప్పటి వరకు ప్రత్యేకమైన వ్యాక్సిన్‌ ఏమీ లేదు. కానీ, టామీ ఫ్లూ, రెవెంజా  వంటి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ మాత్రం వైద్యులు సూచిస్తారు. 

ఏపీలో వ్యక్తికి సోకిన బర్డ్‌ ఫ్లూ..
ఇప్పటి వరకు కేవలం పక్షులకు మాత్రమే సోకిన బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ వ్యక్తికి సోకింది. ఏలూరులో ఉండే ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే కోళ్లలో ఈ వైరస్‌ తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఙాలు కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే వైరస్‌ సోకిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి :  బ్యాన్‌ చేసిన 36 చైనీస్‌ యాప్స్‌ భారత్‌లోకి రీఎంట్రీ.. ఐదేళ్ల తర్వాత అందుబాటులోకి..  

ఇప్పటికే ఏపీ నుంచి వచ్చే కోళ్లను కూడా బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో తెలంగాణలో ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ వ్యాధితో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. చికెన్‌ తినడానికి కూడా కొందరు సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికెన్‌ విక్రయాలు కూడా భారీ ఎత్తున పడిపోయాయి. అయితే, తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి లేకపోయినా సగానికి పైగా విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు తెలిపారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో బర్డ్‌ ఫ్లూ ప్రచారం వల్ల ప్రజల్లో భయాందోళన పెరిగింది. అయితే, 70 నుంచి 100 డిగ్రీల సెల్సీయస్‌ వేడిలో చికెన్‌ వేడి చేసి తింటే ఏ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : ఉదయం ఉప్పునీరు తాగితే కలిగే ఈ ప్రయోజనాలు చాలామందికి తెలియవు..

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News