Beer Benefits In Summer: మద్యపానం సేవించడం ఆరోగ్యానికి ఎంతో హానికరమైనప్పటికీ కానీ కొన్ని కొన్ని సార్లు అనేక రకాల ప్రయోజనాలను కలిగించవచ్చు. ముఖ్యంగా మందు తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ బీరు తాగడం వాటిల్లే నష్టాలు తక్కువేనని ఇటీవలే కొన్ని అధ్యయనాల్లో తేలింది. నిజానికి విస్కీ ఇతర మందుతో పోలిస్తే, వీరులో ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అలా అని బీర్లను కూడా అతిగా తాగడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి పరిమితంగా తీసుకుంటేనే ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది యువత వేసవి సమయంలో ఎక్కువగా చల్ల చల్లగా బీర్లు తాగినందుకు ప్రాధాన్యమిస్తూ ఉంటారు. నిజానికి సమ్మర్లో తగిన మోతాదులో చల్లని బీర్లు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు..అవేంటో ఓసారి లుక్కేసుకుందాం..
చాలామంది వేసవి సమయాల్లోని గుండె పోటు ఇతర సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అధ్యయనాల ప్రకారం ఈ సమయంలో బీరు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారట. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అధ్యయనాల్లో తేలింది. వీరిలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను ఇతర నాళాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడతాయట.. దీంతోపాటు ఇందులో లభించే సిలికాన్ కూడా ఎముకలని దృఢంగా చేసేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే బీరు లో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయట. దీంతోపాటు కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడే వారికి కూడా ఉపశమనం లభిస్తుందని అధ్యయనాల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా వేసవికాలంలో బీర్ తాగడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందట. ముఖ్యంగా తరచుగా ఎండాకాలంలో పొట్ట సమస్యలతో బాధపడేవారు దీనిని తాగడం వల్ల మలబద్ధకం ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే కొన్ని గుణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడతారు. అలాగే కొందరిలో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బీరు లో ఉండే మూలకాలు అల్జీమర్స్ వ్యాధి రాకుండా కూడా రక్షిస్తాయట. దీంతోపాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే వేసవిలో తగిన మోతాదులో బీరు తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని వారు అంటున్నారు. అయితే ఇవన్నీ ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజు పురుషులు ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు వీరుని మాత్రమే తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలైతే రోజుకు ఒక గ్లాసుకు మించి తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తగిన మోతాదులో తాగితేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వారు అంటున్నారు. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి