Pregnancy Care: ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆరోగ్యంతో పాటు కడుపులో బిడ్డ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే తినే ఆహారం, తాగే నీరు, వేసుకునే బట్టలు, వాడే బ్యూటీ కేర్ ఉత్పత్తులు అన్నీ ముఖ్యమే. అన్నీ కీలక భూమిక పోషించేవే.
మహిళలకు బ్యూటీ కేర్ ఉత్పత్తులపై మక్కువ ఎక్కువ. అధిక సమయం మేకప్ ఉత్పత్తులతోనే గడుపుతుంటారు. అయితే గర్భిణీ స్త్రీలు మేకప్ వస్తువులు వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డైట్ విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ అలవాట్లు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అందుకే గర్భిణీ మహిళలు ఎలాంటి మేకప్ వస్తువులు వినియోగించకూడదో తెలుసుకుందాం..
మహిళలు సాధారణగా రంగు నెరిసిన జుట్టును కాపాడుకునేందుకు డై వాడుతుంటారు. కానీ గర్భిణీ మహిళలు ఆ సమయంలో హెయిర్ కలర్స్ వాడకూడదు. ఎందుకంటే ఉండే అమ్మోనియో చర్మానికి హాని కల్గిస్తుంది. ఇక మరో ముఖ్యమైన పదార్ధం పర్ ఫ్యూమ్. గర్భిణీ సమయంలో మహిళలు డియోడరెంట్ లేదా పర్ ఫ్యూమ్ వినియోగిస్తుంటారు. అయితే ఇవి వాడటం వల్ల కడుపులో బిడ్డపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఉంటాయి. మహిళలకు చర్మ ఎలర్జీ, దురద సమస్యకు కారణమౌతారు.
గర్బిణీ మహిళలు లిప్ స్టిక్ వాడటం మంచి పద్దతి కాదు.ఇందులో ఉండే లెడ్ కాస్సేపటి తరువాత బాడీలోపలకు పోతుంది. కడుపులో బిడ్డ ఆరోగ్యంపై ఈ లెడ్ అనేది దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకే మహిళలు గర్భం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది హెయిర్ రిమూవర్ క్రీమ్. గర్బం సమయంలో మహిళలకు హెయిర రిమూవర్ క్రీమ్ వినియోగించకూడదు. గర్భం సమయంలో శరీరంలో హార్మోన్ మార్పులు జరిగే క్రమంలో కెమికల్స్ ఉండే హెయిర్ రిమూవర్ క్రీముల వల్ల చర్మ ఎలర్జీ రావచ్చు.
Also read: Heart Health: మీ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలి, ఎలా ఉండాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook