Badam Milk: బాదం పాలు ఆరోగ్యానికి ఎంతవరకూ మంచివి, నష్టాలు కూడా ఉన్నాయా

Badam Milk: బాదం పాల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. డెయిరీ ఉత్పత్తుల్లో ఒకటిగా మారింది. రుచి బాగుండటంతో అందరూ చాలా ఇష్టపడుతుంటారు. అయితే ఆరోగ్యానికి ఇది ఎంతవరకూ ప్రయోజనకరమనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 14, 2024, 09:42 PM IST
Badam Milk: బాదం పాలు ఆరోగ్యానికి ఎంతవరకూ మంచివి, నష్టాలు కూడా ఉన్నాయా

Badam Milk: మార్కెట్‌లో లభించే వివిధ రకాల డెయిరీ ఉత్పత్తుల్లో ఒకటి బాదం పాలు. వెన్నతో పాటు అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. బాదం, పాలు రెండూ ఆరోగ్యపరంగా అద్భుతమైనవి కావడంతో బాదం పాలు కూడా మంచివేనని భావిస్తుంటారు. నిజంగా బాదం పాలు ఆరోగ్యానికి మంచివా కావా అనేది పరిశీలిద్దాం.

బాదం పాలు తయారీ చాలా సులభం. బాదంను నీళ్లతో స్మాష్ చేసి వడకాచి ఓ బాటిల్‌లో ఉంచుతారు. అదే మార్కెట్‌లో లభించే బాదం పాలను వేస్ట్ బాదం ముక్కలు, విరిగిన పాలతో చేస్తుంటారు. ఇందులో మంచి నాణ్యత కలిగినవి కొన్ని మాత్రమే ఉంటాయి. మిగిలినదంతా కెనోలా ఆయిల్, అధిక ఫ్రక్టోజ్ కలిగిన కార్న్ సిరప్, కొన్ని ఫ్లేవర్స్  ఉంటాయి. బాదంలో ఉండే ఆక్సలేట్ కారణంగా గౌట్, కీళ్ల నొప్పులు ఉత్పన్నం కావచ్చు. ఆక్సలేట్ ఎక్కువగా తీసుకుంటే చర్మంలో క్రిస్టల్స్ ఏర్పడవచ్చు. అందుకే చాలామంది వైద్యులు బాదం పాలు తాగమని చెప్పరు. 

బాదం పాలను కొంతమంది డెయిరీ ఉత్పత్తుల్లో మంచి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తుంటారు. కానీ ఇందులో అసలు పాలలో ఉండే కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ బి12 ఉండవు. దాంతోపాటు అధిక చక్కెర, ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటారు. ఫలితంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలు కలగవు. నట్స్ అంటే ఎలర్జీ ఉండేవాళ్లు కూడా బాదం పాలకు దూరంగా ఉండాలి. 

బాదం పాలతో ప్రయోజనాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ. ఇది లాక్టోజ్ ఫ్రీ కావడం వల్ల డైరీ ఉత్పత్తులంటే ఎలర్జీ ఉండేవాళ్లు, శరీరంలో లాక్టోజ్ సంగ్రహణ ఉండనివాళ్లు బాదం పాలు తాగవచ్చు. బాదం పాలలో కేలరీలు, శాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో కూడా దోహదం చేస్తుంది. గుండెను పదిలంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే బాదం పాలు ఆరోగ్యానికి మంచివే. కానీ డెయిరీ పాలకు పూర్తిగా ప్రత్యామ్నాయం కానే కాదు. కేలరీలు తక్కువగా ఉండటం, ల్యాక్టోజ్ ఫ్రీ కావడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం. 

Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు>

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News