Swapnaala Naava Song Viral: ఎందరో మహానుభావులు.. కలలు కనండి వాటిని సహకారం చేసుకోండి అని దేశ యువతకు సూక్తులు అందించారు.. అయితే కొంతమంది మాత్రం ఈ సూక్తులను దృష్టిలో పెట్టుకొని ఎల్లవేళలా కష్టపడుతూ చివరికి సక్సెస్ అవుతూ ఉంటారు.. అంతేకాకుండా కోరికలను నెరవేర్చుకునే లక్ష్యాన్ని పెట్టుకుంటే ఏదైనా సాధించచ్చని నిరూపిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే అమెరికాలో డల్లాస్ నగరంలో స్థిరపడిన ఓ తెలుగు వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్టార్ట్ చేశారు.. అతని ఎవరో కాదు గోపాలకృష్ణ కోటారు... ఆయన శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక అద్భుతమైన నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో భాగంగానే తన కుమార్తె శ్రీజ కొటారు ఆలపించి, నటించిన ‘స్వప్నాల నావ' పాటకు సంబంధించిన వీడియో షూటింగ్ను ఇప్పటికే పూర్తిచేసుకుని యూట్యూబ్ లో కూడా విడుదల చేశారు. ఈ పాటను ఇటీవల మరణించిన సినిమా గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం అందిస్తూ.. రూపొందించారు..
ఈ పాటను ఓఎమ్‌జీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సమర్పిస్తూ ప్రొడ్యూసర్ గా మీనాక్షి కొనసాగుతున్నారు.. అయితే ఈ సాంగ్ విడుదలైన కొద్ది రోజుల్లోనే ఎవరు ఊహించని స్థాయిలో వ్యూ సంపాదించుకుంది.. సిరివెన్నెల సీతారామశాస్త్రి టాలీవుడ్ లోనే కాకుండా వివిధ సినిమా ఇండస్ట్రీలకు అద్భుతమైన పాటలను అందించారు.. ఆయన పాటలతో పేక్షకులను ఆకట్టుకున్నారు.. ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ పాటను అంకితం చేసినట్లు బృందం తెలిపింది.. ఈ వీడియో సాంగ్ గతంలో బ్లాక్ బస్టర్ చిత్రాలైన మనసంతా నువ్వే, నేనున్నాను మూవీ లకు దర్శకుడిగా పని చేసిన డా. వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ గా ‘స్వప్నాల నావ’ అనే యూట్యూబ్ మ్యూజిక్ వీడియో రూపొందించారు.
డల్లాస్ కు చెందిన శ్రీ గోపీకృష్ణ కొటారు ఇటీవల స్థాపించిన ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’ నిర్మాణ సంస్థపై ఈ మ్యూజిక్ వీడియోను మొదటిసారిగా నిర్మించడం చాలా గ్రేట్.. అంతేకాకుండా ఈ పాటను నిర్మాత గోపాలకృష్ణ కుమార్తె శ్రీ తేజ పాడడం, నటించడం విశేషమని సినీవర్గాలు అంటున్నాయి. ఈ ‘స్వప్నాల నావ’ పాటను శ్రీక్రియేటివ్స్ యూ.ఎస్.ఏ. యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. అయితే విడుదల చేసిన కొద్ది రోజులకే దాదాపు వన్ మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంది. ఈ పాటలో అద్భుతమైన లిరిక్స్ ఉండడం వల్ల నేటిజన్స్ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి అద్భుతమైన పాటలు మళ్లీ మళ్లీ రూపొందించాలని కొంతమంది నెటిజన్స్ తెలుపుతున్నారు.
AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి