Vikrant Film Creations: టాలీవుడ్‌లో కొత్త ప్రొడక్షన్ ప్రారంభమైంది. విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ (VFC) ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. VFC ప్రొడక్షన్ హౌస్ ద్వారా శివకృష్ణ మందలపు ప్రొడ్యూసర్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహూ గారపాటి, ప్రముఖ డైరెక్టర్, అడ్డా సినిమా ఫేమ్ కార్తీక్ రెడ్, నిర్మాత రాందాస్ ముత్యాల, ప్రముఖ వ్యాపార వేత్త నర్సింహ రెడ్డి, మందలపు ప్రవళిక, స్వప్న చౌదరి అమ్మినేని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాన్ని నిర్వహించి.. VFC ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శివకృష్ణ మందలపు మాట్లాడుతూ.. తమ విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై త్వరలోనే పెద్ద సినిమా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో ఎన్నో మంచి సినిమాలు నిర్మించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. కుటుంబ సభ్యుల మద్దతు, ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహం లేకుండా ఇది సాధ్యం కాదని అన్నారు. అతిథులు మాట్లాడుతూ.. VFC ప్రొడక్షన్ హౌస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. శివకృష్ణ కంటెంట్ బెస్డ్ సినిమాలను ఆడియన్స్‌కు అందిస్తారని నమ్మకం ఉందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మూవీ టీమ్, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో పూజా కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. VFC ప్రొడక్షన్ హౌస్ నుంచి భారీ మూవీ అనౌన్స్‌మెంట్ రానుంది.
Also Read: Viral Video: పెళ్లిలో డాన్స్ చేస్తు చనిపోయిన యువతి.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన..
Also Read: Anil-Chiru Movie: అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా ఫిక్స్, షూటింగ్ ఎప్పుడు, స్టోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter