Beauty Movie Teaser: స్కూటీ చుట్టూ ‘బ్యూటీ’ స్టోరీ.. ఇంట్రెస్టింగ్‌గా టీజర్

Beauty Movie Teaser: జీ స్టూడియోస్ ఆధ్వర్యంలో వస్తున్న ‘బ్యూటీ’ టీజర్ విడుదలైంది. దీనిని మారుతీ టీమ్ ప్రొడక్ట్  నిర్మిస్తూ వస్తోంది. అయితే ఈ టీజర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2025, 01:16 PM IST
Beauty Movie Teaser: స్కూటీ చుట్టూ ‘బ్యూటీ’ స్టోరీ.. ఇంట్రెస్టింగ్‌గా టీజర్

Beauty Movie Teaser: అద్భుతమైన వరస ప్రాజెక్ట్స్‌తో వానరా సెల్యులాయిడ్ తమ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది. థ్రిల్లర్‌ మూవీ ‘త్రిబాణధారి బార్బారిక్‌’ మూవీతో అతి త్వరలోనే ఆడియెన్స్‌ ముందుకు రానుండగా.. ఈ లోపు మరో లవ్‌తో పాటు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో అలరించేందుకు రెడీ అయింది. మరోసారి మారుతి టీంతో కలసి 'బ్యూటీ' అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కబోతున్నట్లు వెల్లడించారు. భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  నిర్మాతలుగా ఉమేష్ కేఆర్ బన్సాల్‌తో పాటు అడిదాల విజయపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ మూవీలో హీరోహీరోయిన్స్ గా అంకిత్ కొయ్యతో పాటు నీలఖి నటించాచారు. ఈ మూవీకి  బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాత పని చేస్తున్నారు. 

ఇటీవలే ప్రేక్షకుల్లో అద్భుతమైన ఆసక్తిని పెంచిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని.. శుక్రవారం వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ‘బ్యూటీ’ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ అందరిలోనూ ఎంతో ఆసక్తి పెంచుతూ వస్తోంది. ప్రేక్షకుల నుంచి ఈ టీజర్‌ ఎంతో బాగుందని.. చాలా ప్లెజెంట్‌గా ఉందని టాక్‌ వచ్చింది. ఈ టీజర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా అద్భుతమైన ప్రేమ కథతో పాటు మిడిల్‌ క్లాస్‌ ఎమోషన్స్‌తో అందుబాటులోకి  రాబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే త్వరలోనే రాబోయే ఈ సినిమాలో  అంకిత్ కొయ్య, నీలఖి పాత్రలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు టీజర్‌లో చూపించిన విధంగా తండ్రిగా నరేష్, తల్లిగా వాసుకి పాత్రలు కూడా చాలా బాగుంటాయి. ఈ టీజర్‌ గమనిస్తే.. మొత్తం ఓ స్కూటీ చుట్టునే తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూటీ వచ్చాకా ఏం జరగబోతోంది? అసలు ప్రధాన పాత్రలో ఉండే హీరోయిన్‌ స్కూటీని ఎందుకు అడుతుందనే విషయాలు.. ఈ స్కూటీ వచ్చక వచ్చే మార్పులను.. ప్రేమ కథలో ట్విస్టులు అనే అంశాలపై టీజర్‌ ఉండబోతోంది.

ఇక ఈ టీజర్‌ చూస్తే అద్భుతమైన విజువల్స్‌తో పాటు ఆర్‌ఆర్‌లు ఎంతో బాగుంటాయి. దీంతో పాటు ఆసక్తికరమైన ప్రశ్నలను ఈ టీజర్స్‌ను చాలా బాగా కట్‌ చేశారు. అలాగే ఇందులో డైలాగ్స్‌ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ టీజర్‌లోని ప్రధాన డైలాగ్ ‘లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను’ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉందనిపిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా విజయ్ బుల్గానిన్ పని చేయగా.. మ్యూజిక్‌ చాలా ఆకర్శనీయంగా నిలుస్తోంది. 

AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News