Naresh Pavitra Kiss సీనియర్ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రల ముక్కోణపు కథ ఆ మధ్య ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. బెంగళూరు హోటల్లో నరేష్ పవిత్రలు ఉంటే.. హోటల్ వద్దకు వెళ్లి రమ్య నానా హంగామా చేసింది. వారిని చెప్పుతో కొట్టబోయింది. అలా కన్నడ మీడియా మొత్తం కూడా నరేష్ పవిత్ర రమ్యల మీద ఫోకస్ పెట్టేసింది. తెలుగు మీడియాలోనూ నరేష్, రమ్య, పవిత్రల వ్యవహారం వైరల్ అయింది.
నరేష్ పవిత్రల న్యూ ఇయర్ సర్ ప్రైజ్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ రిలేషన్‌ను కన్ఫామ్ చేస్తున్నట్టుగా లిప్ లాక్ పెట్టేసుకున్నారు. అప్పుడు అది సినిమా ప్రమోషన్ అని ఎవ్వరూ అంతగా అనుకోలేదు. అది నిజమైన ప్రకటన అని, పెళ్లి చేసుకుంటున్నారా? అని అంతా అనుకున్నారు. అందుకే ఇలా పబ్లిక్‌గా ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారని షాక్ అయ్యారు. అయితే అది మళ్లీ పెళ్లి అనే సినిమా ప్రమోషన్స్ అని తరువాత అర్థమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook