రివ్యూ: రత్నం (Rathnam)
నటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ మీనన్, విజయ్ కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సుకుమార్
ఎడిటర్: టి.ఎస్.జాయ్
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
నిర్మాత: జీ స్టూడియోస్, బెంచ్ ఫిల్మ్స్
దర్శకత్వం: హరి
విడుదల తేది: 26-4-2024
విశాల్ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి డైరెక్షన్లో జీ స్టూడియోస్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రం 'రత్నం'. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగులో విడుదలైంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
చిత్తూరులో ఒక కూరగాయాల మార్కెట్లో పనిచేసే రత్నం (విశాల్) చిన్నప్పుడే అదే మార్కెట్లో మాముళ్లు వసూలు చేసుకొనే ఓ రౌడీ పన్నీర్ (సముద్రఖని) ప్రాణాలను కాపాడుతాడు. ఈ క్రమంలో రత్నం ఓ హత్య చేయాల్సి వస్తుంది. దీంతో అతను బోస్టన్ స్కూల్లో పడేస్తారు పోలీసులు. ఈ క్రమంలో పన్నీర్ ఊరి ఎమ్మెల్యే అవుతాడు. అతని కుడి భుజంగా అతని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు రత్నం. ఈ క్రమంలో నగరికి చెందిన మల్లిక (ప్రియా భవాని శంకర్) ఓ పరీక్ష రాయడానికి ఆ ఊరు వస్తుంది. ఆ తర్వాత హీరో ఆమెను చూసి షాక్‌కు గురవతాడు. ఈ క్రమంలో కొంత మంది దుండగులు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే.. హీరో ఆమెను కాపాడే పనిలో పడతాడు. అయితే రత్నం మల్లికను ఎందుకు కాపాడాడానికి గల కారణం ఏమిటి ? ఈ క్రమంలో లింగం బ్రదర్స్ (మురళీ శర్మ తదితరులు) మల్లికను ఎందుకు చంపాలనుకుంటారు ? చివరకు మల్లికను కాపాడానికి రత్నం ఏం చేసాడు ? చివరకు లింగం బ్రద్రర్స్ ఏమయ్యారనేదే ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు హరి చిన్న పాయింట్ చుట్టు ఈ కథను తనదైన యాక్షన్ స్టైల్లో అల్లుకున్నాడు. మొత్తంగా ఆపదలో ఉండే హీరోయిన్. ఆమెను రక్షించే హీరో. ఇదేదో ఒక్కడు, భద్ర, భరణి సినిమాల నుంచి వస్తున్నదే. ఇందులో చిన్న ట్విస్ట్ మాత్రమే కొత్తగా ఉంటుంది. మిగతాదంతా రొడ్డ కొట్టుడే. తనదైన యాక్షన్ సన్నివేశాలతో తన మార్క్ చూపించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే హీరో, హీరోయిన ప్రేమ, రొమాన్స్‌కు దూరంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా హీరో సింగం తరహా పోలీస్ క్యారెక్టర్ అయితే.. ముందున్నది రౌడీ అయినా.. డోంట్ కేర్ అంటూ చెలరేగిపోతాడు. ఇక్కడ హీరో రౌడీ కాబట్టి... ఎదురుగా పోలీసున్న డోంట్ కేర్ అన్నట్టుగా సాగుతుంది హీరో క్యారెక్టర్. ఆ ఊర్లో పోలీసులు చేయలేని పనిని రత్నం ఒక్కడే ఒంటి చేత్తో చేస్తాడంటూ.. ఓ సందర్బంలో సముద్రఖని పోలీసులను హెచ్చరించే సీన్ ఉంటుంది. సింగం తరహా పోలీస్ సినిమాలను డైరెక్ట్ చేసింది ఇతనేనా అతనిపిస్తోంది. ఈ తరహా సీన్ పెట్టి పోలీసుల పరువును తీసాడు. మొత్తంగా అందరు మాస్ డైరెక్టర్స్ చూపించినట్టు ఈ సినిమాలో కూడా హీరోకు అడ్డు చెప్పే వాడిని నరికి పారేయడమే అన్నట్టుగా హీరో క్యారెక్టర్‌ను తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో హీరోయిన్లా కాకుండా ఓ క్యారెక్టర్లా చూపించాడు డైరెక్టర్. మల్లిక పాత్రను చూసి హీరో ఎందుకు ఎమోషన్ అయ్యాడనే సీన్ కన్విన్సింగ్‌గా చెప్పాడు. కమర్షియల్ సినిమాల్లో హీరో, హీరోయిన్ మధ్య ఇలాంటి ప్రయోగం చేయడం డైరెక్టర్ గట్స్ ని చూపిస్తోంది. మధ్యలో హీరోకు విలన్ మధ్య వైరం ఎందుకో ఉందో చూపించడం కాస్తంత ట్విస్ట్ ఇచ్చే అంశం. మొత్తంగా ఎపుడో 90ల నాటి రొటీన్ రివేంజ్ డ్రామాను సరికొత్తగా ప్రెజెంట్ చేద్దామని చూసాడు కానీ ఎందుకో వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. అయితే యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కాస్తంత రిలీఫ్ ఇస్తుంది. ఈ సినిమాకు దేవీశ్రీ మ్యూజిక్ ఇచ్చాడా అనే డౌట్స్ ఈ సినిమా చూస్తే వస్తుంది. ఒక మెలోడీ సాంగ్ మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. ఆర్ఆర్ పర్వాలేదు. ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
విశాల్ తనదైన యాక్షన్ సన్నివేశాల్లో బాగానే నటించాడు. కానీ సెంటిమెంట్స్ సీన్స్‌లో తేలిపోయాడు. కథానాయికగా నటించిన ప్రియా భవానీ శంకర్ తన యాక్టింగ్‌తో కట్టిపడేసింది. మురళీ శర్మ ఈ సినిమాలో మరోసారి తన విలనిజాన్ని ప్రదర్శించాడు. సముద్రఖని తన పాత్రలో ఒదిగిపోయాడు. యోగిబాబు ఉన్నంతలో నవ్వించాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తన పరిధి మేరకు నటించి మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
నిర్మాణ విలువలు
ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
రొటిన్ కథ
ఎడిటింగ్
లాజిక్ లేని సీన్స్
చివరి మాట.. రత్నం.. సానబట్టని 'రత్నం'..
రేటింగ్.. 2.25/5
Also Read: Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter