KINGDOM: కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీకి ‘కింగ్ డమ్’ పేరుతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్ తో ఈ సినిమా హిట్ గ్యారంటీ అనే నమ్మకం ఏర్పడింది. లైగర్ తర్వాత మూడు భాషల్లో ‘కింగ్ డమ్’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. ఇక హిందీ వెర్షన్ కు రణ్ బీర్ కపూర్.. తమిళంలో సూర్య ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉండటం కలిసొచ్చే అంశం. విజయ్ దేవరకొండకు సరైన సమయంలో మాస్ యాక్షన్ సినిమాగా ఇది నిలవనుంది. గౌతమ్ తిన్ననూరి.. ‘జెర్సీ’ వంటి సెన్సిబుల్ స్టోరీ తర్వాత ఇపుడు భారీ యాక్షన్ చిత్రంతో పలకరించబోతున్నాడు.
తాజాగా హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్ డమ్” సినిమా టీజర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. బుధవారం సాయంత్రం రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కేవలం 24 గంటల్లో 29 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో టాప్ ట్రెండ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఈ టీజర్ ట్రెండ్ కావడం విశేషం. ‘కింగ్ డమ్’ సినిమా మీద ఆడియెన్స్ కు ఉన్న క్రేజ్ ను ఈ హ్యూజ్ రెస్పాన్స్ చెబుతుంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
‘కింగ్ డమ్’ టీజర్ లో విజయ్ దేవరకొండ న్యూ లుక్, క్యారెక్టరైజేషన్, హై ఎండ్ పర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉన్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్, సూర్య, రణ్ బీర్ ఇచ్చిన పవర్ ఫుల్ వాయిసెస్ “కింగ్ డమ్” టీజర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. యూట్యూబ్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ‘కింగ్ డమ్’ టీజర్ వైరల్ అవుతోంది.
“కింగ్ డమ్” చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.