Urvashi rautela on dabidi dibidi dance controversy: సంక్రాతికి కానుకగా డాకుమహారాజ్ అభిమానుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయే విధంగా హిట్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతికి వచ్చి అభిమానుల నుంచి భారీగా వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉండగా.. డాకు మహారాజ్ మూవీలో ఊర్వశి రౌతేలా బాలయ్య బాబు సరసన నటించారు. ఆమె దబిడి దిబిడి పాటలో బాలయ్యతో వేసిన స్టెప్పులు వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
దీనికి కొరియోగ్రాఫి అందించిన శేఖర్ మాస్టర్ పై చాలా మంది మండిపడ్డారు. ఒక సీనియర్ టీడీపీ నేత, మూడు సార్లు హిందుపురం ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాలతో పాటు, ప్రజా జీవితంలో ఆయన కంటూ మంచి పేరు ఉంది. అలాంటి గొప్ప నేతకు.. ఈ స్టెప్పులు ఏంటని కూడా కొంత మంది ఫైర్ అయ్యారు. గతంలోనే ఊర్వశి రౌతేలా దీనిపై స్పందించారు.
అయితే.. తనకు బాలయ్యతో కలసి డ్యాన్స్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది అన్పించలేదని క్లారిటీ ఇచ్చారు. బాలయ్యతో కలిసి సినిమా చేయడం తనలక్ అని కూడా చెప్పుకొచ్చారు. తాజాగా.. ఊర్వశి రౌతేలా ఈ వివాదంపై మరోసారి మాట్లాడారు. ఈ పాట రిహర్సల్స్ అంతా కూల్ గా జరిగిపోయిందన్నారు. అన్ని పాటల మాదిరిగానే దీనికి కూడా కొరియో గ్రాఫి అందించారన్నారు. తాను స్టెప్పులు వేసేటప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందిగా ఫీల్ కాలేదని అన్నారు.
కొంత మంది కావాలని లేనీ పోనీ విధంగా రూమర్స్ వ్యాప్తి చేందిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో తప్పు పట్టడానికి ఏముందని కూడా కౌంటర్ వేశారు.ఇదిలా ఉండగా.. బాబీ దర్శకత్వంలో డాకుమహారాజ్ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదలైంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్థా శ్రీనాథ్, బాబీ దేవోల్ కీలక పాత్రల్లో నటించారు. ఊర్వశీ రౌతేలా అతిథి పాత్ర పోషించారు. ఈ మూవీ భారీగానే వసూళ్లను రాబట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter