Tribanadhari Barbarik: ఈ మధ్యకాలంలో తెలుగులో యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను మెప్పు పొందుతున్నాయి. నయా దర్శక నిర్మాతల ఆలోచనలు, ప్రెజెంటేషన్ ఇప్పటి తరం ఆడియన్స్ ను బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా ఈ రూట్లో ‘త్రిబాణధారి బార్భరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతోన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. తాజాగా నీవల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు రఘురాం అందించిన సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ పాడారు. ఈ సినిమా మేజర్ హైలైట్ అయ్యాయి. సాంగ్ లో కనిపిస్తున్న సీన్స్ యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. రిలీజ్ చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఈ చిత్రానికి ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన మ్యూజిక్-ఆర్ఆర్, కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్ బాగున్నాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణ కానుందని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తోంది చిత్రయూనిట్.
తారాగణం: సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర నటించారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.