Thiruveer: తెలుగులో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోన్న తిరువీర్..!

Thiruveer upcoming project: తిరువీర్..జార్జ్ రెడ్డి..పలాస 1978 వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం..ఆయన ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఫోటోగ్రాఫర్ పాత్రలో తిరువీర్ నటించనున్నారు. ఇది ఆయన కెరీర్‌లో మరొక కొత్త, సవాలుగా కనిపించే పాత్ర అవుతుందని తిరువీర్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 5, 2025, 04:49 PM IST
Thiruveer: తెలుగులో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోన్న తిరువీర్..!

Thiruveer upcoming film: తిరువీర్.. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న తెలుగు నటుడు. జార్జ్ రెడ్డి, పలాస 1978 వంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు పొందాడు ఈ హీరో. ఆ తర్వాత మసూద, పరేషన్ వంటి చిత్రాలలో కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. మసూద సినిమా తిరువీర్ కెరీర్‌లో అత్యంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంగీత కూడా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని వసూలు చేసుకుంది. ముఖ్యంగా ఈ హీరో కథల ఎంపికపై ఈ సినిమా మరింత నమ్మకం తెచ్చిపెట్టింది. 

ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూ ఆ తరువాత కూడా మంచి స్క్రిప్తులు మాత్రమే ఒప్పుకుంటూ వస్తున్నారు ఈ నటుడు.ప్రస్తుతం, తిరువీర్ పలు సినిమాలలో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో. ఈ సినిమాలో ఫోటోగ్రాఫర్ పాత్ర పోషిస్తున్నారు తిరువీర్. ఈ చిత్రం రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతుంది.. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్నది. కాగా ఈ సినిమాలో తన పాత్ర హైలెట్గా నిలవనుంది అని చెప్పుకొచ్చారు ఈ హీరో.

తిరువీర్ ఈ చిత్రాన్ని గురించి మాట్లాడుతూ..”వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్రను పోషించడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. మొబైల్‌తో ఫోటోలు తీసే అనుభవం నాకు ఉన్నా, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం పూర్తిగా కొత్త అనుభవం. కెమెరా ఎలా పట్టుకోవడం, స్టిల్స్ ఎలా పెట్టించాలో నేర్చుకోవడం చాలా చిలిపిగా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేస్తుంది,” అని తెలిపారు.

ఈ సినిమా షూటింగ్ ఇటీవల అరకులో జరిగింది.. అక్కడ గడచిన చలిని తట్టుకుని టీం ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశారు. 

ఈ చిత్రం గురించి తిరువీర్ మాట్లాడుతూ..”మసూద తరువాత నేను ఎక్కువగా సెలెక్టివ్‌గా సినిమాలు, కథలు ఎంచుకుంటున్నాను. నాకు సరిపోయే పాత్రలు మాత్రమే తీసుకుంటున్నాను. నా పూర్వ అనుభవం అయిన స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఈ పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నాను. దర్శకులు, నిర్మాతలు నా కోసం పాత్రలు, కథలు రాస్తున్నప్పుడు, నేను నటించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయని అనుకుంటున్నాను. ఈ విజయం నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది,” అని అన్నారు.

తిరువీర్ ప్రస్తుతం భగవంతుడు అనే మరో ప్రాజెక్ట్‌పై కూడా పనిచేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌తో తిరువీర్ తన కెరీర్‌లో మరిన్ని కొత్త వైవిద్యమైన ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఈ కొత్త ప్రాజెక్టులతో తిరువీర్ తెలుగులో మరిన్ని విజయాలను సాధిస్తారని అభిమానులు నమ్మకంగా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Zee Tv Sa Re Ga Ma Pa: ప్రతిష్టాత్మక వేదికలపై 'జీ సరిగమప' గాయనీలు అద్భుత ప్రదర్శన

Also Read: Rana Naidu 2 Teaser: 'రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే'.. వెంకీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News