Thandel movie played in apsrtc bus: నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వచ్చిన తండేల్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. విడుదలైన రెండు రోజుల్లోనే భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. సినిమా థియేటర్ లన్ని కూడా హౌస్ ఫుల్ బోర్డులతో దర్శన మిస్తున్నాయి. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొవడంతో మూవీ టీమ్ పండగ చేసుకుంటున్నారు.
ఇటీవల సక్సెస్ మీట్ లో నాగచైతన్య , సాయిపల్లవి చాలా ఎమోషన్ కు గురయ్యారు. ఇదిలా ఉండగా..తండేల్ సినిమా ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ బస్సులో టెలికాస్ట్ చేశారు. దీనిపై ప్రస్తుతం నిర్మాత బన్నీవాసు సీనియస్ అయ్యారు. సినిమాను తామంతా ఎంతో కష్టపడి తీస్తామని, దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయోద్దని ప్రజల్ని కోరారు. అదే విధంగా..ఏపీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా ట్విట్ చేశారు. తండేల్ కోసం మూవీ టీమ్ ఎంతో కష్టపడిందని దయచేసి.. ఇలాంటి ఘటనల్ని మళ్లీ కాకుండా చూడాలని కోరారు.
మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన తండేల్ ను చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7 రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే. సినిమాను పైరసీ చేసే వాళ్లపై చట్టపరంగా ముందకు వెళ్తమని హెచ్చరించారు.
ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి వారిని వదిలేది లేదని తండేల్ మూవీ టీమ్ స్పష్టం చేశారు. ఈ మూవీ ప్రస్తుతం చైతుకు బిగ్గెస్ట్ హిట్ ను అందించింది. మరోవైపు సాయిపల్లవి కెరీర్ లో సైతం మంచి ఊపునిచ్చిన సినిమాల లిస్ట్ లో తండేల్ కూడా చేరిపోయింది. శ్రీకాకుళంలో మత్స్యకారులు పాక్ వెళ్లి జైళ్లలో చిక్కుకున్నారు. వీరి యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter