Thala Pre Release Event: ‘తల’ మూవీ బిగ్గెస్ట్ హిట్ గ్యారంటీ.. టీజర్, ట్రైలర్ తో పెరిగిన అంచనాలు..

Thala Pre Release Event: అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో   ఆయన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘తల’.  ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భాగ్యనగరంలో ఘనంగా జరిగింది.

Last Updated : Feb 12, 2025, 07:55 PM IST
Thala Pre Release Event: ‘తల’ మూవీ బిగ్గెస్ట్ హిట్ గ్యారంటీ.. టీజర్, ట్రైలర్ తో పెరిగిన అంచనాలు..

Thala Pre Release Event:  దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘తల’ మూవీ.  అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ చిత్రంతో కథానాయకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.   ఈ సినిమా అమ్మ రాగిన్ సరసన అంకిత నస్కర్ హీరోయిన్ గా నటించింది. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేశారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.  ధర్మతేజ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ నెల 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. "పాత తరంలో తల తాకట్టుపెట్టైనా పిల్లలను  ప్రయోజనకులను చేయాలంటారు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ తన తల పెట్టి కొడుకును మంచి కథానాయకుడిని  చేశాడు. టైటిల్ తల అన్నప్పుడు తమిళ్ లో తల అంటే వేరే అర్థం కదా అంటే కాదు తెలుగులో తల అనే అర్థం అన్నారు. గ్లింప్స్ బావున్నాయి. రాగిన్ రాజ్ నటన బాగుంది. మంచి ఫ్యూచర్ ఉందని అర్థం అవుతుంది. తెలిసిన ఆర్టిస్ట్ లున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజగారు పాటలు ఎక్స్ ల్లెంట్ గా ఉన్నాయి. ఈ 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. " తల సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.  ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి మీ అందరూ మా అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీకి, అమ్మ రాగిన్ కు మంచి బహుమతి ఇవ్వాలని కోరారు.  రాగిన్ కల నిజం కావాలని కోరుకుంటున్నానన్నారు.  

నటుడు రోహిత్ మాట్లాడుతూ.." ఈ 14న ‘తల’ సినిమా విడుదలవుతోంది. మీరంతా థియేటర్స్ కు వచ్చి సినిమా చూడాలి.  ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ దాగున్నాయి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. ఎస్తేర్ గారితో కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. హీరోయిన్ బెంగాలీ అయినా తెలుగులో డైలాగ్స్ సూపర్బ్ గా చెప్పింది.  హీరో రాగిన్ ను చూస్తే నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతోంది.

సీనియర్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "2013 నుంచి అమ్మ రాజశేఖర్ తో మంచి అనుబంధం ఉంది.అతను  కథలను కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే హీరోలో రవితేజ కనిపిస్తున్నాడు. ఈ మూవీతో రాగిన్ రూపంలో మరో కొత్త ఆణిముత్యం దొరుకుతాడు అనే ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.."అందరికీ నమస్కారం.. తల మూవీతో మునుపటి అమ్మ రాజశేఖర్ ను అందరు చూస్తారు. ఈ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. అతను చెప్పినదానికంటే ఇంకా బెటర్ గా తీశారు. తన కొడుకును హీరోగా నిలబెట్టాలన్న కసి కనిపించిందన్నారు. ఈ నెల 14 థియేటర్స్ లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఖాయం అన్నారు.  

నటి ఎస్తేర్ మాట్లాడుతూ " ఈ కథ చాలా బావుంది.  రాగిన్ రాజ్ కు మంచి డెబ్యూ అవుతుంది. అమ్మ రాజశేఖర్ గారు ఇతరుల ఫేమ్ ను వాడుకోవాలనుకోలేదు. అందరికీ గుర్తింపు వచ్చే పాత్రలే రాసుకున్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

తల హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. "తల కథ మా నాన్న నాకు రెండేళ్ల కిందటే చెప్పారు. ఆ స్టోరీ నుంచి మీ ముందు కొత్త యాక్టర్ గా పరిచయం అవుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాము.  14న ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.  ఈ కథ చూస్తే నా వయసు 18యేళ్లు. ఆ వయసు అబ్బాయి అమ్మ  సెంటిమెంట్ తో ఏ లెవల్ కు వెళతాడు అనేది మెయిన్ ప్లాట్. దీంతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలూ ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూస్తే అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అంటారు.." అన్నాడు.

దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. " మూడు నాలుగు నెలలుగా స్ట్రెస్ గా ఉన్నాను. అయినా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ అని చెప్పాలి. లైఫ్ లో చాలా స్ట్రగుల్ చూశాను. ఆ టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్ని ప్రశ్నించిన అందరికీ ఈ మూవీతో సమాధానం చెబుతుందున్నారు. నాలాగే నా కొడుకు రాగిన్ రాజ్ ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.  

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News