Shambhala: కల్కి అవతారం పుట్టే ‘శంబాల’ ప్రదేశం మన దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే దాని గురించి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. తాజాగా అదే సంబల్ లేదా ‘శంబాల’ టైటిల్ తో తెలుగులో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన లుక్స్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మరో క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు పొందిన ‘కృష్ణమ్మ’ చిత్రంలో తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు అర్చన అయ్యర్. ప్రస్తుతం అర్చన అయ్యర్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’లో లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మేకర్లు ఈ చిత్రంలోని ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వస్తున్నారు. ఆది సాయికుమార్, స్వాసిక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా అర్చన అయ్యర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అర్చన ఎరుపు చీరలో కనిపిస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తోంది. బ్యాక్ గ్రౌండ్‌లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. పోస్టర్లతోనే అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది చిత్రయూనిట్. యుగంధర్ ముని డైరెక్షన్ లో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ ఎత్తున ఈ చిత్రం ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకమైన కథ, గ్రిప్పింగ్ కథనం, హై స్టాండర్డ్స్ వీఎఫ్ఎక్స్‌తో ఆడియెన్స్‌కు గొప్ప అనుభూతిని అందించడం పక్కా అని చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ(ఆర్‌ఎఫ్‌సి)లో జరుగుతోంది.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.