Sobhita Dhulipala Gets Slipped: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శోభిత ధూళిపాల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే టాలీవుడ్ కంటే ఈమెకు బాలీవుడ్ లోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు లభించాయి.
బాలీవుడ్ హీరోయిన్ గానే మంచి పేరు దక్కించుకున్న ఈమె తమిళ్లో కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే నాగచైతన్యను ప్రేమించిన ఈమె తద్వారా భారీ పాపులారిటీ అందుకుంది. ఇక ఎప్పుడైతే ఆయనతో చట్టపట్టలేసుకొని తిరిగిందో ఊహించని క్రేజ్ దక్కించుకుంది అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా అక్కినేని కోడలుగా శోభిత ఎట్టకేలకు అడుగుపెట్టేసింది. నాగచైతన్యను పెళ్లి చేసుకొని కొత్తకోడలి పోస్ట్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.ముఖ్యంగా గ్లామర్ పాత్రలతో మరింతగా యువతను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా శోభిత ధూళిపాలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. అసలు విషయంలోకి వెళితే,ఒక ఎత్తు నుంచి కారు దగ్గరకు సమీపిస్తున్న సమయంలో సడన్గా కాలు జారింది. అయితే ఆమె కింద పడకుండా చాలా స్మార్ట్ గా కాళ్లల్లో బలాన్ని చూపించి పక్కకు తప్పుకుంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా శోభిత చాలా స్మార్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శోభితకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఇక శోభిత ధూళిపాల, నాగచైతన్య జంట విషయానికి వస్తే.. ఇద్దరూ కూడా వేరే కాపురం పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సమంత లాగే శోభిత కూడా అదే పద్ధతి ఫాలో అవుతోందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Also Read: Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ
Also Read: Pay Revision Commission: 'రెండు పీఆర్సీలు పెండింగ్.. ఆర్టీసీ విలీనం కోసం 15 రోజులే గడువు: జేఏసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.