RRR Movie Resumes Shoot: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రారంభం, సెట్లో చేరిన తారక్, చెర్రీ

RRR Movie Resumes shoot: బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR Movie). కరోనా వ్యాప్తితో విరామం ప్రకటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ ట్వీట్ చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 24, 2021, 01:37 PM IST
RRR Movie Resumes Shoot: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రారంభం, సెట్లో చేరిన తారక్, చెర్రీ

RRR Movie Resumes shoot: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ వైపు అంచనాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తి కారణంగా పలుమార్లు సినిమా వాయిదా పడింది. వ్యాక్సినేషన్ అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ నేడు ప్రారంభమైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొండు వీరుడు, గిరిజన నాయకుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విప్లవవీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా మెప్పించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR Movie). కరోనా వ్యాప్తితో విరామం ప్రకటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ ట్వీట్ చేసింది.

జూలై చివరికల్లా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి భావిస్తున్నారు. ఈ మేరకు నేటి నుంచి ప్రారంభం కానున్న షూటింగ్ మరింత వేగం పెంచే అవకాశం ఉంది. దసరా కానుకగా వీక్షించేందుకు అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకే చెర్రీ (Ram charan movie), ఎన్టీఆర్, అజయ్ దేవగణ్‌ల బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ లేదా లుక్ వంటి అప్‌డేట్స్ అందించారు. మెగా యాక్షన్ ప్యాక్ మూవీ షూటింగ్ త్వరగా పూర్తి కావాలని, పోస్ట్ ప్రొడక్షన్‌కు కరోనా అడ్డంకిగా మారే అవకాశాలు తక్కువ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News