Netflix: నెట్ ఫ్లిక్స్ లో అలరించేందుకు రెడీ అయిన వెంకీ, రానాల ‘రానా నాయుడు 2’, ‘టెస్ట్’ వెబ్ సిరీస్..

Netflix: నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఇయర్ అద్భుతమైన వెబ్ సిరీస్ తో పాటు అద్భుతమైన కంటెంట్ తో రాబోతోంది. ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అందులో వెంకటేష్, రానాల ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ తో పాటు మాధవన్, నయనతారల  ‘టెస్ట్’ వెబ్ సిరీస్ రాబోతున్నాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 6, 2025, 03:48 PM IST
Netflix: నెట్ ఫ్లిక్స్ లో అలరించేందుకు రెడీ అయిన వెంకీ, రానాల ‘రానా నాయుడు 2’, ‘టెస్ట్’ వెబ్ సిరీస్..

Netflix: నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఇపుడు సరికొత్త కాన్సెప్ట్ తో భారతీయ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఈ ఓటీటీలో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్,  స్పోర్ట్స్ డ్రామా సహా అన్ని జానర్స్ ను టచ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ కు వరల్డ్ వైడ్ గా 700 మిలియన్లకు పైగా వీక్షకులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ఇయర్ డిఫరెంట్ కంటెంట్ తో అలరించేందుకు రెడీ అవుతోంది.

ముఖ్యంగా మాధవన్, సిద్ధార్ధ్, నయనతార, మీరా జాస్మిన్ ముఖ్యపాత్రల్లో ఎస్. శశికాంత్ దర్శకత్వంలో ‘టెస్ట్’ అనే వెబ్ సిరీస్ రాబోతుంది. ఏ వైనాట్ స్టూడియో బ్యానర్ మీద చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. జీవితమే ఓ ఆట అనే కాన్సెప్ట్‌తో ఈ ‘టెస్ట్’ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు డిఫరెంట్స్ రూట్స్  ఎంచుకున్న ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ ఈ స్టోరీ  తిరుగుతుంది. ప్రేమ, అంతులేని కలలు, లక్ష్యాలు, కోరికలు, క్రికెట్ వంటి ఎమోషన్స్ చుట్టూ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ఈ సిరీస్‌ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఎస్.శశికాంత్ కథతోపాటు డైరెక్ట్ చేస్తున్నారు.

మరోవైపు వెంకటేష్, రానా దగ్గుబాటిల ‘రానా నాయుడు సీజన్ 2’ రాబోతుంది. ఇప్పటికే టీజర్ తో పాటు ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది.  
ఇప్పటికే రానా నాయుడు సీజన్-2 రెడీ అయింది. రానా నాయుడు ఫస్ట్ సీజన్‌కు వచ్చిన ఆదరణ అందరికీ తెలిసిందే. ఇక ఈ రెండో సీజన్‌లో రానా నాయుడికి ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసాడు. తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు రానా నాయుడు ఏం చేశారు? గతంలో చేసిన పనుల వల్ల ఏర్పడిన ఈ కొత్త సమస్యలు ఏమిటనేదే కథాంశంతో  రెండో సీజన్ ఉంటుంది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇప్పటికే ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకటేష్.. ఇపుడు ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సిరీస్ లో మొదటి భాగంలోనే లాగా బూతు పవర్ ను కాస్త తగ్గించి తెరకెక్కించారు. పూర్తి యాక్షన్, భావోద్వేగాల నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా, అర్జున్ రాంపాల్, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా నటించారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News