Ram Gopal Varma: పోలీసుల విచారణకు రామ్‌గోపాల్ వర్మ.. బందో బస్తు చేపట్టిన అధికారులు..

Rgv before Ongole Police: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు పోలీసుల ఎదుట హజరుకానున్నారు. గతంలో పలుమార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో తాను.. ఫిబ్రవరి 7న హజరవుతానని వర్మ పోలీసులకు గతంలోనే రిక్వెస్ట్ చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 7, 2025, 09:20 AM IST
  • పోలీసుల ఎదుట ఆర్జీవీ..
  • సస్సెన్స్ లో సిబ్బంది..
Ram Gopal Varma: పోలీసుల విచారణకు రామ్‌గోపాల్ వర్మ.. బందో బస్తు చేపట్టిన అధికారులు..

Ram gopal varma controversy vyuham post case: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలలో నిలిచారు . ఆయన ఈరోజు ఒంగోలు పోలీసులు ఎదుట హజరు కానున్నారు. ఆర్జీవీ గతంలో వ్యూహాం సినిమా నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లపై కాంట్రవర్సీ పోస్టులను తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేశారు.

దీనిపై  దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఒంగోలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దీనిపై తమ ఎదుట హజరు కావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అంతే కాకుండా.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆతర్వాత.. హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.

ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూనే.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని సీఐ శ్రీకాంత్ ఇటీవల నోటీసు  జారీ చేశారు. అయితే తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని , ఫిబ్రవరి 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ రిక్వెస్ట్ చేశారు.

Read more: Sonu sood: సోనూసూద్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. అసలు కారణం ఇదే..

ఈ క్రమంలో  ఒంగోలు పోలీసుల ఎదుట రామ్ గోపాల్ వర్మ హజరుకానున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే.. ఆర్జీవీ గతంలో కూడా విచారణకు వస్తానని చెప్పి.. చివరి నిమిషంలో తప్పించుకున్న సందర్భాలు కొకొల్లలు. ఈ క్రమంలో ఆయన విచాణకు వస్తారా..?..లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ గా మారిందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News