Game Changer Songs: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ కోసమే రూ.90 కోట్లా?

Game Changer Movie: శంకర్-రామ్ చరణ్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2023, 11:28 AM IST
Game Changer Songs: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ కోసమే రూ.90 కోట్లా?

Game Changer Songs: శంకర్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎన్నో కోరుకుంటారు. ఎందుకంటే ఈసినిమాలో భారీతనం ఉంటుంది. ఆకట్టుకునే విజువల్స్, అబ్బుర పరిచే గ్రాఫిక్స్, భారీ సెట్స్.. ఇలా ఎన్నో చూపిస్తారు శంకర్. ఇక పాటల కోసం అయితే ఎక్కడా కాంప్రమైజ్  కాకుండా పెద్ద మెుత్తంలో ఖర్చు చేస్తారు శంకర్. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie) అనే మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజకీయ, సామాజిక అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

ఈసినిమాలో మెుత్తంగా ఐదు పాటలున్నాయి. వీటి చిత్రీకరణ కోసం 90 కర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఆల్బమ్ చాలా క్వాలిటీగా ఉంటుందని ఇప్పటికే ఇదివరకే పలు ఇంటర్వ్యూల్లో తమన్ చెప్పాడు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛాంజర్ సాంగ్స్ గురించి మాట్లాడారు. పాటల విషయంలో ఇలాంటి కాన్సెప్ట్ ను ఎవరూ చేయలేదని జానీ మాస్టర్ అన్నారు. 

Also Read: Hidimba OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘'హిడింబ'’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగనుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇది దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా. దాంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

Also Read: Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News