Ram Charan -Manchu Vishnu Rare Record: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రాంచరణ్ ఎక్కడ జిన్నా లాంటి కామెడీ సినిమాలు చేస్తూ కాలం నడిపిస్తున్న మంచు విష్ణు ఎక్కడ అని పొరపాటు పడకండి. వీరిద్దరూ ఈ జనరేషన్ లో ఒక అరుదైన రికార్డును కలిసి పంచుకున్నారు. ఆ విషయాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ తన తండ్రి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.
కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసిన రామ్ చరణ్ తర్వాత తన తండ్రి చేస్తున్న దాదాపు అన్ని సినిమాల్లోనూ నిర్మాతగానూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పేరుతో ఏర్పాటు చేసిన సదరు సంస్థను రామ్ చరణ్ ఒకపక్క మేనేజ్ చేస్తూనే మరోపక్క హీరోగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆశ్చర్యకరంగా తండ్రి వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు.
కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్‌ను స్టార్ట్ చేసిన చరణ్ తండ్రి చిరంజీవితో మొదటగా ‘ఖైదీ నెంబర్ 150, తర్వాత ‘సైరా నరిసింహా రెడ్డి ఆచార్య’, గాడ్ ఫాదర్ సినిమాలను నిర్మించారు. మంచు విష్ణు కూడా నిర్మాతగా తన తండ్రి మోహన్ బాబు హీరోగా ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా తెరకెక్కించారు. అలా ఈ తరంలో రామ్ చరణ్ తర్వాత తండ్రితో సినిమా నిర్మించిన హీరోగా మంచు విష్ణు రికార్డుకు ఎక్కాడు.
అయితే అప్పటి తరంలో నాగార్జున కూడా తన తండ్రి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తానూ నిర్మాతగా అన్నపూర్ణ స్డూడియో పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అలా ఆయన తండ్రితో సినిమాలు నిర్మించిన హీరోగా రికార్డులకు ఎక్కారు. మరో హీరో హరికృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్ హీరోగా నటించిన డ్రైవర్ రాముడు వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. రామ్ చరణ్, మంచు విష్ణులతో పాటు అప్పటి తరంలో హరికృష్ణ, నాగార్జున తమ తండ్రితో సినిమాలు నిర్మించిన హీరోలుగా ఉన్నారు.
Also Read: Taraka Ratna Death: ఆ ఒక్కడు లేకుంటే బాబు, లోకేష్ ఆ మరకతోనే జీవించాల్సి వచ్చేది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook