Rajamouli Love Story with Reshmi: ప్రసిద్ధ దర్శకుడు రాజమౌళి, టీవీ యాంకర్ రష్మి గౌతమ్‌తో కలిసి నటించిన ఒక అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది 17ఏళ్ల క్రితం తీసిన యువ సీరియల్‌లోని ఓ సన్నివేశం. ఈ వీడియోలో రాజమౌళి, రష్మి మధ్య ఆసక్తికరమైన లవ్ ట్రాక్ కనిపిస్తుంది.
రాజమౌళి సాధారణంగా తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మాత్రమే మెరిసినా సంగతి తెలిసిందే. గతంలో ఓ సీరియల్‌లోనూ నటించారు. ఈ వీడియోలో రష్మి, రాజమౌళి మధ్య రేడియో ద్వారా ప్రేమ మొదలై..చివరకు కేఫ్‌లో కలుస్తారు. ఈ సన్నివేశం వినోదభరితంగా సాగుతుంది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు పొందిన రష్మి, గతంలో పలు సీరియల్స్, సినిమాల్లో కూడా నటించారు. కానీ యువ సీరియల్‌లో ఆమె రాజమౌళితో కలిసి నటించడం ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది.
ఇప్పటికే రాజమౌళి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించి పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఓ ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నారు. మరోవైపు, రష్మి గౌతమ్ `జబర్దస్త్`లో యాంకర్‌గా రాణిస్తూ సినిమాల్లోనూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రాజమౌళి అప్పట్లో కూడా నటించారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. రష్మి అప్పుడు ఎలా ఉందో చూడండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా, ఈ అరుదైన క్లిప్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.