Prabhas Kalki 2898 AD Movie Review: పాన్ ఇండియా వైడ్‌గా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ఫీవర్ ఓ రేంజ్లో ఉంది. సలార్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి 2898 ఏడీ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అత్యంత భారీ బడ్జెట్ మూవీ కావడం.. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ కావడం.. టీజర్, ట్రైలర్ హాలీవుడ్ రేంజ్లో ఉండడంతో ఈ సినిమాపై ఊహకందని రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ వంటి స్టార్స్‌కు తోడు టాలీవుడ్ స్టార్స్ కూడా అతిథి పాత్రలు పోషించారు. దీంతో Kalki 2898 AD సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. మరీ ప్రభాస్ కల్కి మూవీ అంచనాలను అందుకుందా..? ట్విట్టర్లో ఆడియన్స్ ఏమంటున్నారు..? రెబల్ స్టార్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా..? చూసేద్దాం పదండి.
ఫస్టాఫ్‌లో ప్రభాస్ పాత్ర సరదాగా ఉంటుందట. విజువల్స్, సెటప్ ఓ రేంజ్లో ఉన్నాయని.. భారతీయ సినిమా నుంచి ఇప్పటివరకు చూడలేదని అంటున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో పాటు ఆకర్షణీయంగా ఉంటుందని చెబుతున్నారు. "ఇండియన్ సినిమాకి ఇంతకు ముందెన్నడూ లేని మూవీని తీసుకురావడానికి ప్రయత్నించినందుకు కల్కి టీమ్ మొత్తానికి అభినందనలు. నాగ్ అశ్విన్ అద్భుతంగా తీశారు. విజువల్స్, ప్రతి చిన్న విషయంపై చాలా దృష్టి పెట్టారు. అతిథి పాత్రల్లో మృణాల్ క్యారెక్టర్ పెద్దగా లేదు. విజయ్ దేవరకొండ అతిథి పాత్ర చాలా బేసిగా ఉంది. కొన్ని చోట్ల BGM అదిరిపోయింది. ప్రభాస్ ఫన్ క్యారెక్టర్లో బాగా నటించాడు. క్లైమాక్స్‌లో ఫ్యాన్స్‌కు తగిన సీక్వెన్స్ ఇచ్చాడు.." అని అంటున్నారు.
Kudos to the whole of team of Kalki for attempting to bring a never before movie for Indian Cinema.
Nag Ashwin showed signs of both brilliance and inexperience. He was brilliant in focusing on the visuals and the finer details world. However, it felt at times he couldn’t…
— Venky Reviews (@venkyreviews) June 26, 2024
#KalkiFirstReview 4/5 ⭐
𝗦𝘂𝗽𝗲𝗿-𝗵𝗶𝘁"#Prabhas did a Fantastic job, #AmitabhBachchan, #DeepikaPadukone and #DishaPatani looks fab & #KamalHaasan stole the show. overall, Movie is Great but boring too.
Kudus to #NagAshwin & #AshwiniDutt."#Kalki/#Kalki2898AD (#KalkiReview) pic.twitter.com/6VtalDCVSt— Zohaib Shah 🇵🇰 (@Zohaib4Sweety) June 4, 2024
కల్కి మూవీకి నెట్టింట అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. ఊహకందని క్లైమాక్స్‌తో నాగ అశ్విన్ మంచి ట్రీట్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఉందని.. ఇండియాన్ బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయమంటున్నారు. మరికొంతమంది సలార్ కూడా ఈ సినిమా ముందు పనికి రాదని అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయని.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగేనంటున్నారు. విజవల్స్ ఓ రేంజ్లో ఉన్నాయని.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు.
Movie sets to core and serious phase pre climax is on wit ahswathama and bhariava🔥🔥
Visuals and bgm sets indian standards too high🔥🔥#prabhas #Kalki #kalki2898ad #Kalki2898ADonJune27 #AmitabhBachchan #VijayDevarakonda #DeepikaPadukone #KamalHasaan #DulquerSalmaan#rebelstar— Beyond The Reel (@btrsir) June 26, 2024
#Kalki2898AD I liked it 👍🏻
Go watch it on the Big Screen.
— Thyview (@Thyview) June 26, 2024
"కల్కి 2898 AD భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేయనంది. అసాధారణమైన పౌరాణిక సమ్మేళనం, భవిష్యత్తు కథాకథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రభాస్ పవర్‌హౌస్ ప్రదర్శనను అందించాడు. అద్భుతమైన సహాయక తారాగణంతో సంపూర్ణంగా పూరించాడు. సినిమా మొత్తం పవర్ ప్యాక్‌గా ఉంది.." అని రివ్యూ ఇస్తున్నారు. ట్విట్టర్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
June 26, 2024— NexusRift 🚩 (@SRKsNexusRift)
OneWordReview #Kalki2898AD- EXCELLENT
RATING - ⭐⭐⭐⭐Kalki 2898 AD is truly groundbreaking film that set a new benchmark in Indian cinema. movie captivate audiences with their extraordinary blend of mythology and futuristic storytelling. The visuals are nothing short of… pic.twitter.com/eeSgekdaL4