Prabhas-Sai Pallavi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన సలార్ బ్లాక్‌బస్టర్ విజయం సాధించగా, ఆయన నటించిన కల్కి 2898 AD ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం ప్రభాస్ సలార్ 2, స్పిరిట్, రాజా సాబ్ చిత్రాల షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు.
టాలీవుడ్‌లో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. హనురాఘవపుడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యుద్ధ నేపథ్య కథాంశంతో తెరకెక్కనుంది. ఈ క్రమంలో ఈ సినిమాలో సాయి పల్లవి కూడా ఉంది అనే వార్త తెగజోడున ప్రచారం అవుతుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర కథకు కీలకమని, ఆమె ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలో కనిపించనున్నట్లు సమాచారం.
Second Heroine in Fauji: సాయి పల్లవి గతంలో హను రాఘవపుడితో.. పడిపడి లేచే మనసు సినిమాలో పనిచేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించకపోయినప్పటికీ, సాయి పల్లవి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ సినిమా నష్టాల్లో ఉన్నప్పుడు సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. ఇక ఆ చిత్రం తర్వాత హను రాఘవపూడి తీసిన సీతారామం చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక ఈ సినిమాతో ఈ దర్శకుడు కాస్త స్టార్ దర్శకుడిగా మారారు.
Sai Pallavi in Fauji: ఈ క్రమంలో ఇప్పుడు అతను తీస్తున్న ప్రభాస్ సినిమాల్లో.. పడి పడి లేచే మనసు టైంలో.. ఆ సినిమా ఫ్లాప్ అయినా కానీ అంతటి సహాయం చేసిన సాయి పల్లవికి ఛాన్స్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఇక అంతేకాకుండా ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యమైనది కావడంతో.. ఆ క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సాయి పల్లవికి కూడా ఈ దర్శనం కూడా పరిచయం ఉండటంతో అందుకనే ఈ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రభాస్ పలు బడ్జెట్ చిత్రాలలో స్టార్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి లాంటి నటనకు ప్రాధాన్యమిచ్చే హీరోయిన్‌తో ఆయన జోడీ కుదరడం ఆసక్తికర అంశంగా మారింది. సాయి పల్లవి సాధారణంగా కథ బలమైన చిత్రాలను ఎంచుకుంటుంది, కాబట్టి ఈ సినిమాలో కథ కూడా ఎంతో ఎమోషనల్ గా సాగుతుంది అని అభిమానులు నమ్ముతున్నారు.
అయితే సాయి పల్లవి ప్రభాస్ సరసన నటిస్తుందా? అనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. ఇది నిజమైతే, ప్రేక్షకులకు మరో కొత్త కాంబినేషన్‌ను చూసే అవకాశం లభించనుంది.
Read more: Sonu sood: సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ.. అసలు కారణం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter