Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల ఏర్పడ్ద వరద బాధితుల సహాయార్ధం రూ. 6 కోట్ల భారీ విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ ఛీప్ పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు.
వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధఇకి రూ. 1 కోటి విరాళం అందించారు. అలాగే పంచాయితీ రాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూన్న పవన్ కళ్యాణ్.. ఆంధ్ర ప్రదేశ్ లో ఉణ్న వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయితీలకు గాను.. ఒక్కో పంచాయితీకి రూ. లక్ష చొప్పున మొత్తంగా రూ. 4 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా పవన్ కళ్ాయణ్.. తెలుగు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించడం విశేషం. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. పంచాయితీ రాజ్ మంత్రిగా ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షిస్తుండంతో పాటు ఎప్పటి కప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన హరి హర వీరమల్లు సినిమాతో పలకరించబోతున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.