NTR's Wife Lakshmi Pranathi : ఎన్టీఆర్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఫేమస్ హీరోగా పేరుగాంచిన వ్యక్తి. సినీ రంగంలోకి..వచ్చింది సీనియర్ ఎన్టీఆర్ మనవడు గానే అయినా.. తన నటన డాన్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. ఇక సినిమాల్లోకి ఎంతైనా కొన్ని రోజులకే లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ ప్రణతి సాధారణంగా మీడియా ముందు కనిపించకపోవడం, సోషల్ మీడియాలో కూడా తక్కువగా యాక్టివ్ గా ఉండటంతో…ఈమె పర్సనల్ లైఫ్ గురించి చాలావరకు సినీ ప్రేక్షకులకు తెలియదు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. అలాగే తాను కూడా ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ బిజినెస్ కేవలం లక్ష్మీ ప్రణతి కోసం కాకుండా, ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు దిశగా ఒక పెద్ద అడుగు కావచ్చు అని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ సాధారణంగా తన అభిమానుల గురించే ఎక్కువ ఆలోచిస్తూ..తన అభిమానుల కోసమే నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం మనం తరచుగా గమనించవచ్చు. ఇప్పుడు, ఆయన తన భార్య లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి ప్రవేశపెట్టి, ఏపీ ప్రజలకు మరింత సేవ చేయాలని చూస్తున్నారంట.
ఇంతకీ లక్ష్మీ ప్రణతి, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఎంచుకున్న బిజినెస్ రంగం ఏమిటి అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే, ఈ బిజినెస్, ఏపీ ప్రజల అవసరాలు తీర్చడమే కాకుండా, ప్రజలతో ఎన్టీఆర్ రెపో పెంచేలా ఉంటుంది అనే వార్త మాత్రం వినిపిస్తోంది.
ఈ బిజినెస్ ప్లాన్ సరైన దిశలో ముందుకు వెళ్లితే, ఎన్టీఆర్ కు మరింత ప్రజల మద్దతు కలగవచ్చు. మరి ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఏమిటి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.
Also Read: Delhi Exit Poll 2025: ఢిల్లీ మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీదే!.. ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళి ఇదే
Also Read: Delhi Exit Polls: బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు.. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కమల వికాసం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.