Rana Naidu 2: ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ నుంచి ఉత్కృష్టమైన వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కమెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా వంటి వివిధ జానర్లతో నెట్ ఫ్లిక్స్ ఈ సంవత్సరం వినోదాన్ని పంచేందుకు రెడీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా వీక్షకులను ఆకర్షించిన నెట్ ఫ్లిక్స్, 2025లో కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల్ని మళ్లీ ఆశ్చర్యపరచనుంది.
మాధవన్, సిద్దార్థ్, నయనతార, మీరా జాస్మిన్ వంటి అద్భుతమైన నటులతో సిరీస్ టెస్ట్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే..జీవితమే ఓ ఆట అనే కాన్సెప్ట్ పైన ఈ సినిమా ఉండబోతుందట. భిన్న మనస్తత్వాలు, లక్ష్యాలు, కోరికలు, క్రికెట్ వంటి అంశాలు ఈ సిరీస్‌లో ప్రధానంగా ఉంటాయి. ఎస్. శశికాంత్ దర్శకత్వంలో, ఈ ప్రాజెక్ట్ ఏ వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌తో తెరకెక్కుతుంది. ఈ సిరీస్‌ను నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విషయంపై నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనిక షెర్గిల్ హర్షం వ్యక్తం చేశారు.
రానా నాయుడు 2 సీజన్
రానా నాయుడు ఫస్ట్ సీజన్ భారీ ఆదరణ పొందిన తరువాత, రెండో సీజన్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది నెట్ ఫ్లిక్స్. ఈ సీజన్‌లో రానా నాయుడికి ఎదురైన కొత్త సమస్యలు, తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు తీసుకున్న నిర్ణయాలు, గతంలో చేసిన పనుల వల్ల ఎదురైన కొత్త సమస్యలు.. కథలో ప్రధానంగా ఉంటాయి. రానా నాయుడు 2 ఈ సీజన్ ప్రేక్షకులను మరింత ఆసక్తికరంగా ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది అని తెలిపారు సినిమా యోజన.
లోగో మోటివ్ గ్లోబల్ మీడియా నిర్మాత సుందర్ అరోన్ మాట్లాడుతూ, "రానా నాయుడు 2ని ప్రేక్షకులకు అందించడానికి ఎంతో సంతోషంగా ఉంది. మొదటి సీజన్ పూర్తయ్యిన వెంటనే రెండో సీజన్ పనులు ప్రారంభించాం. ఈ సీజన్ కథ, స్క్రీన్ ప్లే, బడ్జెట్ అన్నీ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరచడం ఖాయం. నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ఈ సీజన్ అద్భుతంగా రూపొందింది. అలా చూసిన ఆడియెన్స్ ఆశ్చర్యపోయి, తమ అభిప్రాయాలను పంచుకుంటారు" అని చెప్పారు.
ఈ సిరీస్‌లో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి స్టార్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్, కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో, కరణ్ అన్షుమాన్, ర్యాన్ సోరస్, కర్మణ్య అహుజ్జా, అనన్య మోడీ, కరణ్ గౌర్, వైభవ్ విశాల్ వంటి రచయితల రచనలో రూపొందింది.
Also Read: Delhi Exit Poll 2025: ఢిల్లీ మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీదే!.. ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళి ఇదే
Also Read: Delhi Exit Polls: బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు.. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కమల వికాసం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.