Free Movie Tickets: నేషనల్ సినిమా డే 2024 సందర్భంగా సినీ లవర్స్ కి శుభవార్త తీసుకొచ్చింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సెప్టెంబర్ 20న జాతీయ సినిమా దినోత్సవం గా ప్రకటించగా.. ఈ రోజున సినిమా ఔత్సాహికులు దేశవ్యాప్తంగా కేవలం 99 రూపాయలకే ఎంపిక చేసిన థియేటర్లు అలాగే స్క్రీన్ లలో సినిమాలను చూడవచ్చు.
నేషనల్ మల్టీప్లెక్స్ ట్రేడ్ బాడీ నుండి ఒక పత్రిక ప్రకటన విడుదల చేయగా అందులో.. PVR INOX, e Time, Cinepolis, Delite వంటి సినిమా చైన్లు భారతదేశమంతటా 4000 స్క్రీన్ లలో కేవలం 99 రూపాయల డీల్ ను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.
ఈ ప్రత్యేకమైన రోజున.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల విజయోత్సవాన్ని జరుపుకోవడానికి అన్ని వయసుల ప్రేక్షకులను ఒకే చోట చేర్చడానికి ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు సమాచారం.. ఈ విజయాన్ని సాధించడంలో సహకరించిన సినీ ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
జాతీయ సినిమా దినోత్సవం మూడవ ఎడిషన్ రెండు మునుపటి ఈవెంట్ల తర్వాత రికార్డు స్థాయిలో 6 మిలియన్ల మంది ప్రజలు ఇక్కడికి హాజరయ్యారు. ముఖ్యంగా చలనచిత్ర ప్రేమికులు సెప్టెంబర్ 20వ తేదీని ఎంచుకోవడానికి కూడా అనేక ఎంపికలు ఉన్నాయని సమాచారం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్ తో పాటు టైం లెస్ క్లాసిక్ మూవీలు, రీ రిలీజ్ మూవీలు కూడా ఉన్నాయి. కొత్తగా విడుదలైన చిత్రాలలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగువారికి సరిపోదా శనివారం, మత్తు వదలర 2 చిత్రాలు కూడా ఇదే ధరకి లభించబోతున్నాయి.
ఒకవైపు బ్లాక్ బస్టర్ చిత్రాలు… మరొకవైపు రీ-రిలీస్ చిత్రాలతో సినిమా థియేటర్లు సందడి చేయనున్న నేపథ్యంలో.. ఈరోజు కొత్త సినిమా విడుదలలు మాత్రం లేకపోవడం వల్ల ఈ తేదీని ఎంపిక చేసినట్లు సమాచారం. సాధారణంగా సినిమా థియేటర్లలో ఒక్కో టికెట్ ధర రూ.200 పై మాటే. అది థియేటర్ ను బట్టి అక్కడున్న వసతులను బట్టి మారుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీతో సినిమా చూడాలి అంటే మినిమం 2000 రూపాయల ఖర్చవుతుంది.. అలాంటిది ఈరోజు 99 రూపాయలకే సినిమాను ప్రకటించడంతో సినిమా లవర్స్ సంతోషం వ్యక్తం చేసుకున్నారు.
Also Read: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
Also Read: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.