Balakrishna Gift to Thaman: నందమూరి హీరో బాలయ్య , ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ సక్సెస్ అందుకున్నాయి. అందుకే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఏర్పడింది. బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అభిమానులకు తమన్ సంగీతం ఇస్తాడు అనేంతగా ముద్ర పడిపోయింది. ముఖ్యంగా థియేటర్లో కూడా సౌండ్ బాక్సులు పేలాల్సిందే.
అంతలా తన సంగీతంతో బాలయ్య సినిమాలకు బూస్ట్ అందిస్తూ ఉంటారు తమన్ . ఇక బాలయ్య అభిమానులు కూడా తమన్ ను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమా విజయోత్సవ వేడుకలలో సైతం తమన్ కు బాలయ్య ఒక ముద్దు పేరు పెట్టారు. అదేమిటంటే నందమూరి తమన్ కాదు.. ఎన్.బి.కె తమన్ అంటూ పెట్టడం జరిగింది.
దీంతో అప్పటినుంచి తమన్ ను అందరూ బాలయ్య తమ్ముడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా బాలయ్య తమన్ కు ఒక ఖరీదైన కాస్ట్లీ గిఫ్ట్ ను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
బాలయ్య తమన్ కు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే.. ఒక కాస్ట్లీ కారు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారు విలువ రూ.2 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు, నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. తమన్ - బాలయ్య కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలలో అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వంటి సినిమాలు విడుదలయ్యాయి.
ఈ సినిమాలు భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా బాలయ్య కెరియర్ లోనే చాలా కీలకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక అఖండ 2 చిత్రానికి కూడా తమన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో కచ్చితంగా థియేటర్లో మరొకసారి బాక్స్ బద్దలవుతాయి అంటూ తమన్ వెల్లడించారు. సెప్టెంబర్ 25వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter