Atharva OTT Release Date: కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరిల కాంబోలో వచ్చిన చిత్రం ‘అథర్వ’. ఓ క్రైమ్ సీన్లో క్లూస్ టీం ప్రాముఖ్యత ఎలా ఉంటుందన్నది క్లియర్‌గా వివరిస్తూ అథర్వ సినిమాను మహేష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని.. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లో మంచి సక్సెస్‌ను అందుకుంది.
ఇంత వరకు ఎన్నో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లను చూసిన ఆడియెన్స్‌కు ఈ అథర్వ కొత్త ఫీలింగ్ ఇచ్చింది. క్లూస్ టీం పడే కష్టాన్ని చూపించారు. ఇక ఈ మూవీ థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. ఈటీవీ విన్‌లోనూ రిలీజ్ అయింది. అక్కడి ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఇక ఇప్పుడు అథర్వ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. మరి ఇక్కడి ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా అథర్వ ఆకట్టుకునేలా ఉంది. అథర్వ సినిమాకు అటు థియేటర్ ఆడియెన్స్, ఇటు ఓటీటీ లవర్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది.
కథ ఏంటి..?
దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు) పోలీస్ అవ్వాలి.. ఎలాగైనా కేసులను ఇన్వెస్టిగేట్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అతనికి ఆస్తమా ఉంటుంది. దీని కారణంగా పోలీస్ సెలక్షన్లలో ఫెయిల్ అవుతాడు. కానీ పట్టు పట్టి క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు. తన తెలివితో దొంగతనాల కేసును క్షణాలో పరిష్కరిస్తాడు. ఈ క్రమంలోనే తన కాలేజ్ మేట్ అయిన నిత్య (సిమ్రన్ చౌదరి) క్రైమ్ రిపోర్టర్‌గా మళ్లీ తన జీవితంలోకి వస్తుంది. ఆమె మీదున్న ప్రేమను మాత్రం బయటకు చెప్పలేకపోతాడు కర్ణ.
నిత్య ఫ్రెండ్ జోష్ని (ఐరా) పెద్ద హీరోయిన్. జోష్ని ఇంట్లోనే జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. అక్కడ మర్డర్ జరిగిందని, వేరే వ్యక్తి చంపాడని ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసును అలా ముగించేస్తారు. కానీ నిత్య మాత్రం ఆ విషయాన్ని నమ్మదు. ఇక కర్ణ సైతం ఆ కేసును సాల్వ్ చేయాలని అనుకుంటాడు. అసలు జోష్ని, శివల నేపథ్యం ఏంటి..? వాళ్లిద్దరినీ ఎందుకు చంపారు..? ఎవరు చంపారు..? అసలేం జరిగి ఉంటుంది..? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసును కర్ణ ఎలా పరిష్కరించాడు..? అనేది తెలుసుకోవాలంటే అథర్వ సినిమా చూడాల్సిందే.
Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్
Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ... ప్రపంచంలో ఒకే ఒక్కడు..
అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter